Salaar :మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన దీని ట్రైలర్ దుమ్ము లేపుతోంది. ఇప్పుడు ప్రభాస్‌ను హైలెట్ చేస్తూ మరో ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీమ్.

New Update
Salaar :మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే

Salaar Second Trailer: బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా మెప్పించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మూవీపైనే పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గురించి హైప్ చాలా ఎక్కువగానే ఉంది. ముందు వచ్చిన కేజీఎఫ్ (KGF) సంచలనం సృష్టించడంతో పలార్ మీద కూడా అందరూ అంచనాలను పెట్టుకున్నారు. మరోవైపు ప్రభాస్ (Prabhas) కూడా కొన్నేళ్ల తర్వాత ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన సలార్ పోస్టర్స్, టీజర్ (Salaar Teaser) సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దీనితో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పేశారు ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ప్రభాస్ అభిమానులు ఊహించని రీతిలో మాస్ యాక్షన్ కంటెంట్ ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ విడుదల పెద్ద పండగే. తాజాగా సలార్ సెకండ్ ట్రైలర్ గురించి మరో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. మొదటి ట్రైలర్ లో దేవా వెర్షన్ లో ప్రభాస్ సందడి చేయగా.. ఇప్పుడు సలార్ గా డార్లింగ్ ని చూపిస్తూ మరో ట్రైలర్ ను విడుదల చేస్తారని చెబుతున్నారు. దేవా నుండి సలార్ గా ప్రభాస్ ఎలా మారాడు అన్న విషయం సెకండ్ ట్రైలర్ లో ఉండనుందని బజ్ వినిపిస్తోంది. లేదంటే సలార్ అనే మరో క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ ఇస్తారా అనే సందేహం కూడా వస్తోంది. దీంతో ఈ సెకండ్ ట్రైలర్ పై అంచనాలు తెగ పెరిగిపోతున్నాయి.

Also read:ఎమోషనల్ లవ్ డ్రామా ‘హాయ్.. నాన్న’ సినిమా ఎలా ఉంది అంటే..

సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు డిసెంబర్ 16వ తేదీన ఈ రెండో ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం. కేజీఎఫ్ 1, 2 బ్లాక్ బస్టర్ల తర్వాత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ( Films) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీలో ప్రభాస సరసన శ్రుతి హాసన్ కనిపించనుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు గతంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలిపారు. తొలి భాగం డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు