Upasana: మరో బేబీ రాబోతుందంటున్న మెగా కోడలు ఉపాసన!

మెగా కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలో మరో బేబీ రాబోతుందంటూ పోస్ట్‌ పెట్టింది అది కాస్త ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఉపాసన తన చెల్లెలు సీమంతం ఫోటోలను షేర్‌ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

New Update
Upasana: మరో బేబీ రాబోతుందంటున్న మెగా కోడలు ఉపాసన!

మెగా కోడలు ఉపాసన (Upasana) గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. మెగాకోడలిగా ఆమె మంచి పేరే తెచ్చుకుంది. సోషల్ మీడియాలో(Social media) ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకుంది. కొద్ది నెలల క్రితమే ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపాసన మరో బేబీ రాబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

దీనిని చూసిన మెగా అభిమానులు వదినమ్మ మళ్లీ శుభవార్త చెప్పిందంటూ సంతోషపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే...ఉపాసన సోదరి అన్షుపాల వివాహం జరిగి 3 సంవత్సరాలు అయ్యింది. తాజాగా ఆమె సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ..త్వరలోనే మరో బేబీ రాబోతుందని రాసుకొచ్చింది. ఉపాసన తన చెల్లి సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి.. ‘మై హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్. మోర్ బేబీస్ ఆన్ ద వే’ అంటూ పోస్ట్ చేసింది.

దీంతో అభిమానులు ఆమె కి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఉపాసన రామ్‌ చరణ్ ల వివాహం అయిన 11 సంవత్సరాల తరువాత పాప పుట్టింది. ఆ పాపకి క్లీంకార అని నామకరణం చేశారు. ఇప్పటి వరకు పాపను బయటకు చూపించలేదు. దీంతో మెగా అభిమానులు అంతా పాపను ఎప్పుడూ చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

ఇక చరణ్‌ విషయానికి వస్తే గేమ్ ఛేంజర్‌ తో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో కియారా అద్వాణీ చరణ్‌ కి జోడిగా నటించబోతున్నాడు. ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు.

publive-image

Also read: శబరిమల అయ్యప్ప 18 మెట్ల పేరేంటో తెలుసా?వాటి వెనకున్న రహస్యం తెలుస్తే షాక్ అవ్వడం పక్కా..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment