Upasana : ఆయన వల్లే నేను డిప్రేషన్ నుంచి బయటపడ్డాను! తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం...చాలా మందిలాగే డెలివరీ తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్‌లా వ్యవహరించారని మెగాకోడలు ఉపాసన వివరించారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని తెలిపారు. By Bhavana 15 May 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Charan : మెగా కోడలు ఉపాసన(Upasana) ఎప్పుడూ కూడా తన వ్యక్తి గత విషయాలను.. పాప గురించి, భర్త చరణ్ గురించి అభిమానులతో సోషల్ మీడియా(Social Media)లో పంచుకుంటూంటుంది. మెగా ప్రిన్సెస్ క్లీంకార(Klin Kaara) పుట్టిన తరువాత తాను చాలా ఇబ్బందులు పడినట్లు, వాటిని అధిగమించేందుకు చరణ్ చాలా సాయం చేసినట్లు ఉపాసన చెప్పుకొచ్చింది. తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం...చాలా మందిలాగే డెలివరీ తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్‌లా వ్యవహరించారని ఆమె వివరించారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని తెలిపారు. "తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం. కానీ అది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రసవానంతర డిప్రెషన్‌ను తక్కువగా అంచనా వేయలేం. అవసరమనుకుంటే నిపుణులను సంప్రదించి దాని నుంచి బయటపడాలి. చాలా మందిలాగే నేనూ డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు రాంచరణ్(Ram Charan) నాకు ఎంతో అండగా నిలిచాడు. నాతో పాటు మా పుట్టింటికి వచ్చాడు. కూతురు క్లీంకార విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహిస్తాడు. క్లీంకార ఎన్నో విషయాల్లో తన తండ్రిని తలపిస్తుంది" అని ఉపాసన చెప్పుకొచ్చారు. పిల్లల పెంపకంలో తనకెప్పుడూ సాయం చేసే భర్త ఉన్నందుకు హ్యాపీగా ఉన్నట్లు ఉపాసన తెలిపారు. Also read: 34 ఏళ్లకే నానమ్మ అయిన ఇన్ ఫ్లూయెన్సర్! #megastar #ram-charan #cinema #upasana-konidela #klinkara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి