Up CM Yogi: మహిళలకు గుడ్ న్యూస్‌ చెప్పిన సీఎం!

యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ...ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు.

New Update
Yogi: పేదలు, మహిళల జోలికొస్తే మీ పని ఖతమే.. సీఎం సీరియస్ వార్నింగ్!

UP CM Yogi: యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు ఓ బహుమతిని ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్, డివిజన్, రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులలో నియమించిన అధికారులతో సమావేశమై మాట్లాడారు.

ఈ సమావేశంలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు. ఈ విషయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో నాగ పంచమి, శ్రావణ సోమవారం, కాకోరి రైలు యాత్ర వార్షికోత్సవం, రక్షాబంధన్, చేహల్లు, జన్మాష్టమి వంటి పండుగలతో పాటు పోలీసు నియామక పరీక్ష వంటి ముఖ్యమైన పనులను కూడా నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు.

లా అండ్ ఆర్డర్ దృక్కోణంలో ఇది కచ్చితంగా సున్నితమైన సమయం అని.. ప్రతి జిల్లాకు చెందిన పోలీసులు, స్థానిక యంత్రాంగం 24×7 అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు. మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. రాఖీ పౌర్ణమి రోజు కొన్ని ఆరాచక శక్తులు ప్రశాంత వాతావరణాన్ని పాడుచేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయి. అందుకే పోలీసు పెట్రోలింగ్‌ను పెంచండని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Also read: ఆర్‌బీఐ నిర్ణయంతో ఇన్వెస్టర్లకు షాక్.. రూ.2.82 లక్షల కోట్లు నష్టం!

.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)

🔴Live News Updates:

Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.

Google
Google Photograph: (Google )

 

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. అనేక కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని దించుకోవడానికి ఒకేసారి వందలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ.. వందలాది మందిపై వేటు వేసింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మందిని గురువారం ఒకేసారి ఉద్యోగాల్లోంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పటి వరకు కరెక్టుగా ఎంత మందిపై లేఆఫ్స్ ప్రభావం పడిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే గూగుల్ ఇంత పెద్ద మొత్తం లేఆఫ్స్ ఎందుకు విధించిందో అనే విషయాలు గురించి తెలుసుకుందాం.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏప్రిల్ 10న గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకేసారి వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తాజాగా వెలుగులోకి రాగా.. కరెక్టుగా ఎంత మంది ఉద్యోగాలు పోయాయనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై మాత్రం ఈ లే ఆఫ్‌ల ప్రభావం పడినట్లు తెలుస్తుంది. జనవరి లో గూగుల్ తన ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించి.. వెంటనే రెండు నెలలకే కోతలు విధించడంతో అంతా షాక్ అవుతున్నారు.

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో కూడా గూగుల్ సంస్థ 10 శాతం మంది ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు  2023 జనవరి నెలలో మొత్తంగా 12 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అయితే ఇందుకు కారణాలు చాలానే ఉన్నట్లు అనేక వార్తలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత్వం వల్ల గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, అమెరికా ప్రతీకార సుంకాల యుద్ధం, మాంద్యం భయాలు, లాభాలు పూర్తిగా క్షీణించిపోవడం, ఏఐ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల.. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు విధిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒక్క గూగుల్ సంస్థనే కాకుండా అనేక కంపెనీలు పలు కారణాలు చెబుతూ.. వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నాయి. 2025వ సంవత్సరంలోనే సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27 వేల 762 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ వెల్లడించింది. 2024లో సుమారు 549 కంపెనీలు లక్షా 52 వేల 472 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అలాగే అంతకు ముందు  2023లో వెయ్యి 193 కంపెనీలు.. 2 లక్షల 64 వేల 220 మంది ఉద్యోగాలకు కోత విధించినట్లు స్పష్టం చేసింది.

Also Read: Tahawwur Rana: తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

Also Read: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

  • Apr 12, 2025 06:39 IST

    Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేయనున్నాయి.

    AP Govt
    AP Govt

     



Advertisment
Advertisment
Advertisment