/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/hyd-1-jpg.webp)
Hyderabad Bachupally Incident Sensational Facts: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం జరిగింది. ఓ యువకుడిని చంపి ఇన్‌స్టాగ్రామ్‌లో దుండగులు రీల్స్ చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రగతినగర్ చెరువు కట్ట వద్ద సిద్ధూ అనే యువకుడిని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు.. అతడిని వెంటాడి మరీ దారుణంగా హత్య చేశారు. అయితే ఓ హత్య కేసులో సిద్ధూ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రగతినగర్ సిద్దూ తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఆమె ఊరు వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న సిద్ధూ.. తన స్నేహితులైన మహేష్, సమీప్, శివప్పలతో కలిసి మద్యం తాగాడు.
Also Read: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు అరెస్టు.
సోమవారం తెల్లవారుజామున 3.30AM గంటల సమయంలో ప్రగతినగర్‌లో బతుకమ్మ ఘాట్ ఎదురుగా నిలబడి ఉండగా.. గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు సుమార్ 20 మంది బైక్‌లపై వచ్చి సిద్ధూను కత్తులతో పొడిచి చంపేశారు. హత్య చేసిన తర్వాత నిందితులు సెల్ఫీ వీడియో తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తరుణ్ హత్యకు ప్రతీకారంగా తమ పగను నెరవేర్చుకున్నామంటూ ఈ వీడియోలో అన్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.