Telangana Elections: నేడు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ..

ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మరో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలంగాణకు రానున్నారు. జనగాం, కోరుట్లలో జరగనున్న సభలు, ఉప్పల్ రోడ్ షోలో అమిత్ షా పాల్గొననున్నారు. కొల్లాపూర్, ఎల్లారెడ్డిలో నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు.

New Update
Telangana Elections: నేడు రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ..

మరో 10 రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. వరుసగా అగ్రనేతలు ప్రచారానికి కమలం పార్టీ ప్లాన్ వేసేసింది. అయితే ఈరోజు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం అమిత్‌ షా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి 1.00 PM గంటలకు జనగామలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి 2.45 PM గంటలకు కోరుట్ల చేరుకుని అక్కడ జరగనున్న సభలో పాల్గొంటారు. ఇక తిరిగి సాయంత్రం 5.30 PM గంటల నుంచి 7.00PM వరకు హైదరాబాద్‌ ఉప్పల్‌లో జరగనున్న రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8.00PM కి ఢిల్లీ బయలుదేరనున్నారు.

Also Read: చంద్రయాన్‌-4కు సిద్ధమవుతోన్న ఇస్రో.. ఈసారి లక్ష్యమేంటో తెలుసా..?

మరో బీజేపీ అగ్రనేత నితిన్‌ గడ్కరీ ఎల్లారెడ్డి, కొల్లాపూర్ సభల్లో పాల్గొననున్నారు. మరో నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా ఈరోజు హైదరాబాద్‌ రానున్నారు. ఇక ఈనెల 21న కేంద్రమంత్రి పీయూష్ గోయల్, 24,25,26వ తేదీల్లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈనెల 25, 26వ తేదీల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే అస్సాం, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. అలాగే వచ్చేవారం ప్రధాని మోదీ కూడా మళ్లీ రానున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదిలాఉండగా రెండ్రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also Read: విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 40కి పైగా బోట్లు దగ్ధం..

Advertisment
Advertisment
తాజా కథనాలు