/rtv/media/media_files/2025/03/20/TEhHXpySFRHLUk9dnZL5.jpg)
Meerut murder case
మీరట్‌లో ఓ మహిళ.. ప్రియుడుతో కలిసి నావీ ఆఫీసర్‌ను కిరాతకంగా చంపిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ముస్కాన్ భర్తను ఆమె ప్రియుడు సాహిల్‌తో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారు. తీగ పట్టుకొని లాగితే డొంకంతా కదిలినట్లు పోలీసుల దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మాజీ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ లండన్‌లో ఉంటాడు. ముస్కాన్ అనే యువతిని అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా ఉంది. గత నెలలో సౌరభ్ లండన్ నుంచి ఇంటికి వచ్చాడు. అతని భార్య ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్‌లో కలిసి మర్డర్ చేశారు. సౌరభ్ తింటున్న భోజనంలో ముస్కాన్ మత్తుమందు కలిపి ఇచ్చింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాక చంపింది. ఆమె ప్రియుడు సాహిల్ కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ డ్రమ్‌లో వేసి సిమెంట్‌లో కప్పి పెట్టింది. మరుసటి రోజు ఇద్దరు కలిసి హిమచల్, మనాలీ ట్రిప్‌కు వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో దుర్వాసన వస్తోందని ఇంటి ఓనర్ డ్రమ్‌ను పరిశీలించాడు.
Also Read: UP Crime: భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!
అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముస్కాన్ స్కెచ్ వెలుగు చూసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి. హత్య చేసిన తర్వాత డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆమె ప్రియుడు సాహిల్‌కు సౌరభ్ తల, చేతులు ఇచ్చింది. సాహిల్ వాటిని తీసుకెళ్లి శుద్రపూజలు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. చేతబడి అనంతరం వాటిని మళ్లీ తీసుకొచ్చి డ్రమ్‌లొ పాతిపెట్టారు. సాహిల్ రూమ్‌లో దయ్యాల చిత్రాలు, డ్రాగన్ స్కెచ్‌లు గీసి ఉన్నాయి. అతనికి తాంత్రిక పూజలు వచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాదు సాహిల్ గదిలో ఓ నల్లపిల్లి కూడా కనిపించింది. డ్రగ్స్‌కు బానిసైన సాహిల్ తాంత్రిక శక్తులను నమ్మెవాడని, ఇతరులతో తక్కువగా మాట్లాడేవాడని దర్యాప్తులో తేలింది. గంటలు గంటలు ఇంట్లోనే ఒంటరిగా గడిపేవాడని పక్కింటివారు చెప్పారు.
సాహిల్ తల్లి చనిపోయింది. తండ్రి అతన్ని వదిలేసి నోయిడాలో నివసిస్తున్నాడు. సాహిల్ ప్రస్తుతం ఆమె అమ్మమ్మతో ఉంటున్నాడు. సాహిల్ దగ్గరి నుంచి ముస్కాన్ శుద్రపూజలు నేర్చుకుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముస్కాన్‌కు సాహిల్ తల్లి పేరుతో ఫేక్ స్నాప్‌చాట్ అకౌంట్ ఉంది. ముస్కాన్ సాహిల్ తల్లిలాగా నటిస్తూ అతనితో చాట్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. వారిద్దరూ కోడ్ లాగ్వేజ్‌లో ఏవైవో మాట్లాడుకున్నారని తెలుస్తోంది.
ముస్కాన్‌కు యాక్టర్ అవ్వాలని కోరిక ఉందని సౌరభ్ తమ్ముడు బబ్లు పోలీసులకు చెప్పాడు. బాలీవుడ్ యాక్టర్ అవ్వాలని చాలా సార్లు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని అన్నాడు. అంతేకాదు ఈ విషయంలో సారభ్, ముస్కాన్‌ల మాధ్య గొడవ అయ్యింది. 2021లో ముస్కాన్‌కు సౌరభ్ విడాకులు ఇవ్వాడానికి కూడా సిద్ధమైయ్యాడు. కానీ సౌరభ్ ఫామిలీ డైవర్స్ మ్యాటర్ మరోసారి ఆలోచించమని చెప్పారు. దీంతో విడాకులు మాట పక్కన పెట్టి అప్పటి నుంచి ముస్కాన్ మితిమీరిన పనులు సౌరభ్ భరిస్తూ వస్తున్నాడు.
ముస్కాన్ సౌరభ్ దగ్గర నుంచి చాలా మొత్తంలో డబ్బులు తీసుకుందని పోలీసులు చెబుతున్నారు. మొస్కాన్ కుటుంబ ఖర్చులకు సౌరభ్ దగ్గర డబ్బులు అడిగి పంపించేది. ముస్కాన్ అకౌంట్ నుంచి రూ.6 లక్షల ట్రాన్‌సాక్షన్ అయ్యిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో లోతుగా విచారణ జరుపుతున్నా కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. రెండు టీంలు ఏర్పాటు చేసి ఈకేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. విచారణ పూర్తి కాగానే త్వరలో ఛార్జ్‌షీ్ దాఖలు చేయనున్నారు.