/rtv/media/media_files/2025/03/26/qrO4pMgH4NTXrARBVzca.jpg)
Haryana Crime Photograph: (Haryana Crime)
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు, వాటి గురించి తెలిస్తే ఎవరో ఒకరు చనిపోవడం లేదా చంపేయడం వంటివే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల హర్యానాలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహ్‌తక్‌లో జగ్‌దీప్ అనే వ్యక్తి హరిదీప్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!
తన భార్యతో అక్రమ సంబంధం ఉందని..
మస్త్‌నాథ్ యూనివర్సిటీలో యోగా బోధిస్తుంటాడు. అయితే ఈ యోగా గురువు హరిదీప్ ఇంట్లో అద్దెకు ఉంటూ.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హరిదీప్ తన స్నేహితులతో కలిసి జగ్‌దీప్‌ను కిడ్నాప్ చేశాడు. బతికి ఉండగానే ఓ పొలంలో గొయ్యి తీసి పాతిపెట్టాడు. బోర్ వెల్ కోసం అని చెప్పి ముందుగానే కార్మికులకు చెప్పి 7 అడుగులు గొయ్యి తవ్వించాడు.
ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?
హరిదీప్ చంపిన పది రోజుల తర్వాత మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగదీష్ కాల్ రికార్డింగ్‌లు అన్ని విని హరిదీప్‌తో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇదంతా గతేడాది జరగ్గా.. తాజాగా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చూడండి: IPL 2025: ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విక్టరీ..
ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్, బొజ్జగూడ తండా సమీపంలో నీళ్ల ట్యాంకర్‌ను ఇన్నోవా కారు వెనుక నుంచి వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మేళ్లచెరువు మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సోము కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మ, ఉపేందర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి నలుగురు పని కోసం ఖమ్మం వెళ్లి కోదాడకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?