/rtv/media/media_files/2025/03/25/6S0ZBz747JYmiceVIBvP.jpg)
Medchal Betting App Photograph: (Medchal Betting App)
ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా బెట్టింగ్ యాప్‌లకు బలి అవుతున్నారు. తెలిసో తెలియక బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు పోతే మళ్లీ సంపాదించగలరు ఏమో.. కానీ ప్రాణాలు పోతే మళ్లీ తిరిగి రావు. ఈ విషయం తెలిసినా కూడా చాలా మంది క్షణాకావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
రూ.2 లక్షలు పోగొట్టుకున్నందుకు..
ఇటీవల ఓ యువకుడు బెట్టింగ్ యాప్ మోసాలకు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో ఉంటున్న సోమేష్ బెట్టింగ్ యాప్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. తన అక్క పెళ్లి కోసం తల్లిదండ్రులు రూ.2 లక్షలు దాచారు. అవి బెట్టింగ్‌లో పోవడంతో తీవ్ర మనోవేదన చెంది రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ మోసాలతో 20 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!
ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై గత కొద్ది రోజుల నుంచి ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది సినీ నటీ నటులపై కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!
అందులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సహా మరెంతో మంది నటీ నటులపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులను సైతం నిందితులుగా చేర్చారు.
ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!