Britain: బ్రిటన్‌ పార్లమెంటు రద్దు.. ఎన్నికల ప్రచారం ప్రారంభం

బ్రిటన్‌లో జులై 4న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బ్రిటన్ పార్లమెంటు రద్దయింది. దీంతో ఈరోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని అత్యధిక ఒపీనియన్ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి.

New Update
Britain: బ్రిటన్‌ పార్లమెంటు రద్దు.. ఎన్నికల ప్రచారం ప్రారంభం

బ్రిటన్‌లో జులై 4న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తాము ముందుస్తు ఎన్నికలకు వెళ్లనున్నామని ఇటీవలి యూకే ప్రధాని రిషి సునాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రిటన్ పార్లమెంటు రద్దయింది. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగూణంగా గురువారం పార్లమెంట్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం ఆ దేశంలో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంటు రద్దయిన వేళ.. ఈరోజు నుంచి ఐదు వారాల పాటు ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.

Also Read: జపాన్ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా 

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికైన లిజ్‌ ట్రస్‌.. రాజీనామా చేయడంతో.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన తీసుకునే నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. అయితే మరో నెల రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని ఎక్కువగా ఒపీనియన్ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. ఈసారి విపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read: మోదీని ఓడించండి.. పాక్ మాజీ మంత్రి బహిరంగ పిలుపు 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment