Dubai: అరబ్బుల నేలపై తొలి హిందూ దేవాలయం.. ప్రత్యేకతలివే!

యూఏఈలో నిర్మితమైన అతిపెద్ద హిందూ ఆలయానికి చాలా ప్రత్యేకలున్నాయి. 27ఎకరాల విస్తీర్ణంలో రూ. 700 కోట్ల ఖర్చుతో హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామినారాయణ్ సంస్థ నిర్మించింది. 402 పాలరాతి స్తంభాలను అమర్చిన ఆలయ ప్రత్యేకతలు తెలుసుకునేందుకు హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Dubai: అరబ్బుల నేలపై తొలి హిందూ దేవాలయం.. ప్రత్యేకతలివే!

UAE First Hindu Temple: అరబ్బుల నేలపై తొలి హిందూ టెంపుల్ (Hindu Temple) పురుడు పోసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్మితమైన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభం కాబోతోంది. అబుదాబీలో ఆలయాన్ని ప్రారంభించేందుకు విశిష్ట అతిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) యూఏఈ చేరుకున్న విషయం తెలిసిందే. కాగా మోడీకి యూఏఈ స్థానిక ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. అయితే ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకలేంటి? ఎన్ని కోట్లతో నిర్మించారో తెలుసుకుందాం.

హిందూ ధర్మం ఉట్టిపడేలా..
యూఏఈ రాజధాని అబుదాబీలో (Abudabi) దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా.. బాప్స్ స్వామినారాయణ్ సంస్థ (BAPS Swaminarayan Sanstha) ఈ గుడిని నిర్మించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ దేవాలయానికి ఏడు గోపురాలు ఉన్నాయి. అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాలు కట్టారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాతిని ఆలయ నిర్మాణానికి వాడారు. వేలాదిమంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లు కష్టపడి ఈ అద్భుత కట్టడంలో పాలుపంచుకున్నారు. గుడిలో 402 పాలరాతి స్తంభాలని అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులతో పాటు పలు శిల్పాలను చెక్కారు.

ఇది కూడా చదవండి  : Trivikram: గేర్ మారుస్తున్న గురూజీ.. ఫ్యామిలీ గొడవలు వదిలేసి దానిపై ఫోకస్ పెడుతున్నాడట?

నదుల కృత్రిమ ప్రవాహం..
ఆలయ నిర్మాణానికి మొత్తం రూ. 700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. గుడి దిగువ భాగంలో గంగ, యమునా నదుల ప్రవాహాన్ని ప్రతిబింబించేలా కృత్రిమ ప్రవాహం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పశ్చిమాసియాలో అతి పెద్ద హిందూ దేవాలయంగా నిలుస్తోంది. ఆలయంలోని రాతి ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం లాంటి హిందూ పురాణగాథలని చెక్కారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్ధనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, పార్క్‌లు, ఫుడ్‌కోర్టులు ఉండబోతున్నాయి.

భూకంపాలను తట్టుకునేలా..
భూకంపాలు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని తట్టుకునేలా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో పెద్ద సంఖ్యలో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటా సేకరించేలా అమర్చారు. మొత్తంగా యూఏఈలో తొలి హిందూ ఆలయంగా (UAE Hindu Temple) బాప్స్ స్వామినారాయణ్ టెంపుల్ ప్రాముఖ్యత సంపాదించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ట్రంప్‌ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..

ట్రంప్‌ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా కఠిన విధానాన్ని కొనసాగిస్తోంది. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
USA immigration

USA immigration

వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌ ప్రభుత్వం పెళ్లైన కొత్త జంటల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్నవారు అక్కడికి రావాలంటే నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే ఛాన్స్ ఏర్పడింది. ఇది కూడా అనేక పరీక్షలు, ఇంటర్వ్యూలు దాటకొని సక్సెస్ అవుతూనే ఈ అవకాశం దక్కుతుందని అధికారులు చెబుతున్నారు.   అమెరికాలో అక్రమ వలసలు పెరగడంతో వాళ్లని ట్రంప్ ప్రభుత్వం బలవంతంగా స్వదేశాలకు పంపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పెళ్లి పేరుతో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా ? అని ట్రంప్ అధికారులను ఆరా తీశారు. పెళ్లి చేసుకొని అమెరికాకి వస్తామన్న వాళ్లని అన్ని కోణాల్లో పరిశీలించాలని.. ఇంటర్వ్యూలను కూడా కఠినతరం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో గత అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ అంశంలో సులభత విధానం ప్రవేశపెట్టారు. కానీ ఆ గడువు ముగిసిపోయింది. ఇప్పుడు ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లి చేసుకున్న వాళ్లు ఇంటర్వ్యూను ఎదుర్కొనేందుకు పలు అంశాలపై ఫోకస్ పెట్టాలి. వాటిని సమర్పిస్తేనే అధికారులు దీనికి వేగంగా పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.  

Also Read: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్, వివాహ ఖర్చుల రికార్డు, అలాగే ఇరుపక్షాల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషనలకు సంబంధించిన కాల్‌ లాగ్స్, జీవిత భాగస్వామి పేరు మీద తీసుకున్న బీమా వంటివి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ కొత్త జంటలకు ఇంటర్వ్యులో ఇమిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలు కూడా కొన్ని విచిత్రంగా ఉండనున్నాయి. బెడ్‌ మీరు ఏవైపు నిద్రపోతారు ? ముందుగా ఎవరు నిద్రలేస్తారు ?, మీ బాత్‌రూంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి? , మీ జీవిత భాగస్వామికి ఫుడ్ అలెర్జీ ఉందా ? అనే ప్రశ్నలు కూడా అడుగుతారని ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు.  

అమెరికా వ్యక్తిని పెళ్లి చేసుకునే వివాహిత భారత పౌరురాలు అయితే ఆమెను అమెరికా కాన్సులేట్ అధికారులు ఇంటర్వ్యూ చేస్తారు. జీవిత భాగస్వామి H1బీ వర్క్ వీసాపై అమెరికాలో ఉంటేనే అప్పుడు మాత్రమే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల అధికారులు ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వాళ్లు అన్ని పత్రాలను ముందుగానే ఒకిటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. అధికారుల అడిగే ప్రశ్నలకు గతంలో లాగా తేలిదు.. మర్చిపోయా అని సమాధానాలు చెబితే బయటకు పంపిచేస్తారు. బ్లాక్‌లిస్టులో పెడతారు. 

అలాగే ఫేక్ వివాహాలను పసిగట్టే విషయంలో మరింత లోతుగా పరిశీలిస్తారు. ఇక దీనికి సంబంధించిన అధికారిక విధానాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. గ్రీన్‌కార్డు ఉన్నవాళ్లు, తమ జీవిత భాగస్వాములకు స్పా్న్సర్ చేసే వీసాలకు 34 ఏళ్ల సమయం పడుతోంది. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వాములను వేరు వేరుగా ఇంటర్వ్యూ చేస్తారు. సమాధానాలు సరిపోలుస్తారు. ఏదైన తేడా వస్తే బ్లాక్ చేసి పడేస్తారు.  

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసాల కోసం ఫాం ఐ130 పర్మిషన్ పొందడానికి 14 నెలల టైం పడుతుంది. ఆ తర్వాత 34 నెలలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. గ్రీన్‌కార్డు ఉన్నవారు తమ జీవిత భాగస్వాములు స్పాన్సర్ చేసే వీసా.. F2Aకి చాలా ఆలస్యం పడుతోంది. ప్రస్తుతం 2022లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకి ప్రాధాన్యం ఇస్తున్నారు. 

 telugu-news | immigration | usa 

Advertisment
Advertisment
Advertisment