జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన సంఘటనపై స్పందించి ఖండించింది.
'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోంది. ఇటువంటి చర్యలు దేశభద్రతను దెబ్బతీస్తాయి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. అటు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండించింది అని దాడి జరిగిన దాదాపు 24 గంటల తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read : Vinay Narwal : ఈమెకు ఏం చెప్పి ఓదార్చుదాం.. కన్నీళ్లు పెట్టిస్తున్న హిమాన్షి వీడియో!
ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తాం
భారత్ ను ఎవరూ భయపెట్టలేరని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా జవాబు ఇస్తామని అన్నారు. పహల్గాం దాడికి అతి త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని.. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడ నక్కిన కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేదే భారత్ నినాదమని తెలిపారు. ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడ్డారన్న రాజ్ నాథ్ సింగ్... ఈ చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాకుండా, తెరవెనుక ఉన్న వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : BCCI సంచలన నిర్ణయం..ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇక ఉండవు?