USA: అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతుల అరెస్ట్..
అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేయడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్‌లోని మాసీ మాల్‌లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు.
ఇండియాలో చాల్లేదన్నట్టు అమరికాలో కూడా దొంగతనాలు మొదలుపెట్టారు. అమెరికా ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ ఇక్కడకు వచ్చాక దొంగతనాలకు మాత్రం బాగామరిగారు. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత కూడా బుద్ధి రాలేదు. బెయిల్ మంజూరై బయటకు వచ్చాక మళ్లీ దొంగబుద్ధి చూపించారు. డాలస్‌లోని మాసీ మాల్‌లో డబ్బులు చెల్లించకుండా పరార్ అయ్యారు.
కారం రవీందర్ రెడ్డి కూతురు కారం మానస రెడ్డి, పులియల జితేందర్ రెడ్డి కుమార్తె సింధూజారెడ్డి అమెరికాలో చదువుతున్నారు. వీరిలో ఒకరైన మానసరెడ్డి గతంలో పలు దొంగతనాలకు పాల్పడి బెయిల్ మంజూరైనప్పటికీ మళ్లీ దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటన విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థుల ప్రవర్తన గురించి ఆందోళన కలిగిస్తుంది. ఇదే తరహాలో ఏప్రిల్ నెలలో ఓ స్టోర్ లో భవ్య లింగనగుంట (20), యామిని వల్కలపుడి (22) అనే ఇద్దరు యువతులు వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
🔴GT vs KKR: చెండాడేసిన గుజరాత్.. కెకెఆర్ ముందు 199 టార్గెట్ - ఎవరి స్కోర్ ఎంతంటే?
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Rains
తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం,మంగళవారం ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఏప్రిల్ 20 సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్,యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ శాఖ తెలిపింది.
ఇక ఈరోజు సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలమైన ఈదురు గాలులు, పిడుగుల సమయంలో సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మరోవైపు కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2- 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
GT vs KKR: చెండాడేసిన గుజరాత్.. కెకెఆర్ ముందు 199 టార్గెట్ - ఎవరి స్కోర్ ఎంతంటే?
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కెకెఆర్ ముందు 199 టార్గెట్ ఉంది.
Apr 21, 2025 20:54 IST
GT vs KKR: కెప్టెన్ గిల్ వీరబాదుడు.. 15 ఓవర్లకు 1 వికెట్ - పరుగులే పరుగులు
కోల్‌కతాతో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 15 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. 1 వికెట్ నష్టానికి 139 పరుగులు చేశారు. ఓపెనర్ సుదర్శన్ 52 పరుగులతో ఔటయ్యాడు. క్రీజ్‌లో గిల్ (61*), జోష్ బట్లర్ (22*) ఉన్నారు.
GT vs KKR gill Photograph: (GT vs KKR gill)
Apr 21, 2025 20:54 IST
GT vs KKR: దంచికొడుతున్న గుజరాత్ ఓపెనర్లు.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
గుజరాత్ vs కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ చేస్తున్న గుజరాత్ జట్టు 10 ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (49*), సుదర్శన్ (36*) ఉన్నారు.
Apr 21, 2025 19:06 IST
అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?
భద్రాది కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం సీఐ ఏసీబీకి దొరికి 10 రోజుల్లోనే మరో సీఐ రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. భూవివాదంలో సెటిల్‌మెంట్ చేసికి సీఐ సతీష్ కుమార్ డీల్ కుదుర్చుకున్నాడు. అతని అనుచరుడు జర్నలిస్ట్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
Apr 21, 2025 19:06 IST
మరో పదిరోజుల్లో పెళ్లి.. ఇంతలోనే... గుండెపగిలేలా ఏడుస్తున్న కన్నతల్లి
నంద్యాల జిల్లా ఆత్మకూరలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో పెళ్లనగా వరుడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తుండగా .. అతడి బైక్ ని బొలెరో వాహనం ఢీకొట్టింది.
Nandyala incident groom spot dead in accident
Apr 21, 2025 19:05 IST
ఏపీ లిక్కర్ స్కామ్ లో బిగ్ అప్డేట్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Apr 21, 2025 18:20 IST
ఆల్‌టైమ్ రికార్డు.. లక్ష దాటిన బంగారం ధర
బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.
Gold rate
Apr 21, 2025 16:38 IST
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్
చెన్నమనేని రమేష్ వారసత్వ కేసులో తెలంగాణ హైకోర్ట తీర్పు ప్రకారం అతను ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షల డీడీ ఇచ్చారు. తప్పుడు పత్రాలు సమర్పించి ఆది శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నట్లు 2024 డిసెంబర్‌లో హైకోర్టు తేల్చి చెప్పింది.
'పాడుతా తీయగా' సింగర్ ప్రవస్తి కీరవాణి, సునీత, చంద్రబోస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు జడ్జీ సీట్లో కూర్చొని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.
Apr 21, 2025 14:47 IST
మెదక్‌లో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి వాగులో దూకిన తల్లి!
మెదక్ జిల్లా తూప్రాన్‌లో హల్దీవాగు దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి, తన ఇద్దరు చిన్నారులతో కలిసి వాగులో దూకింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మమతను స్థానికులు కాపాడారు.
Apr 21, 2025 14:04 IST
Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న పోప్ సోమవారం ఉదయం 7.35 గంటలకు పోప్ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఈస్టర్ వేడుక జరగగా మరుసటి రోజే ఆయన తుదిశ్వాస విడిచారు.
Pop Fransis
Apr 21, 2025 10:40 IST
IT Employees Accident: మరణంలోనూ వీడని స్నేహం.. ఇద్దరు ఐటీ ఉద్యోగుల దుర్మరణం!
హైదరాబాద్ రింగురోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. చిరకాల మిత్రులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలిచివేస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన భానుప్రకాశ్, బిశ్వాల్ ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు.
బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది దారుణానికి పాల్పడ్డాడు. రైల్వే ఉద్యోగి అయిన బావను లేపేసి అక్కకు ఉద్యోగం ఇప్పించి, తాను ఆస్తిలో షేర్ తీసుకోవాలని కుట్ర చేశాడు. కానీ బిహార్ కు చెందిన బాధితుడు సుమిత్ కుమార్ ఫోన్ రికార్డుల ఆధారంగా వారిపై కేసు పెట్టాడు.
Apr 21, 2025 07:01 IST
విషాదం.. పిడుగుపాటుకు ఒకే రోజు స్పాట్‌లోనే ఐదుగురు..?
రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఒకే రోజు ఐదుగురు పిడుగు పాటుతో మృతి చెందారు. క్రికెట్ ఆడుతుండగా ప్రకాశంలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, కడపలో ఒకరు మృతి చెందారు. వేర్వేరు జిల్లాల్లో పిడుగు పాటు వల్ల ఒకే రోజు మృతి చెందారు.
Thunderbolt
Apr 21, 2025 07:00 IST
Israel: సైన్యం తప్పు వల్లే ఆ మరణాలు.!
గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే ఓ డిప్యూటీ కమాండర్ పై సైన్యం వేటు వేసింది.