Supreme Court: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే: సుప్రీంకోర్టు రాజస్థాన్ ప్రభుత్వం 2001లో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్‌ను తీసుకొచ్చింది. దీన్ని సవాలు చేస్తూ.. ఓ మాజీ సైనికుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. రాజస్థాన్ సర్కార్ నిబంధనను సమర్థించింది. By B Aravind 29 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి రాజస్థాన్ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల అర్హతపై 13 ఏళ్ల క్రితం పెట్టిన నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. 2001లో రాజస్థాన్ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్‌ను తీసుకొచ్చింది. అయితే 2017లో పదవీ విరమణ చేసి.. 2018లో రాజస్థాన్‌లో పోలీస్ కానిస్టేబుల్ కోసం అప్లై చేసుకున్న మాజీ సైనికుడు రామ్ లాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. చివరికి రాజస్థాన్ అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది. Also Read: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా రాజస్థాన్ రూల్‌ను సమర్థించిన సుప్రీం అయితే 2001లో రాజస్థాన్ సర్కార్ పెట్టిన రూల్స్ ప్రకారం.. పిటిషనర్ రామ్‌లాల్ 2018లో అప్లై చేసిన పోలీసు ఉద్యోగానికి అనర్హులయ్యారు. దీంతో 2022లో రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అక్కడ అతనికి ఊరట లభించలేదు. ఇక చివరికి అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2002 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ తీసుకొచ్చిన నిబంధనలు ప్రకారం ఈయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడయ్యాడు. రామ్‌లాల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నిబంధన ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావడానికి.. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధనను పాటిస్తున్న రాష్ట్రాల్లో.. రాజస్థాన్‌తో సహా.. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, కర్నాటక కూడా ఉన్నాయి. అయితే 2021లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా జనాభా నియంత్రణ బిల్లును తీసుకొచ్చింది. ఇతర నిబంధనలతో సహా.. ఇద్దరు పిల్లల విధానాన్ని ఉల్లంఘించిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయకుండా.. అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సిఫార్సులు చేసింది. Also Reaed: బెంగాల్‌లో 17 లక్షల మంది నకిలీ ఓటర్లు…ఈసీకి జాబితాను సమర్పించిన మమత ప్రత్యర్థి..!! #telugu-news #national-news #supreme-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి