NASA: అయ్యో.. అంతరిక్షంలో బ్యాగును పోగొట్టుకున్న వ్యోమగాములు..

అంతరిక్షంలో వ్యోమగాములు తమ టూల్‌ బ్యాగును పోగొట్టుకున్నారు. ఈ సంఘటన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేష్‌న్‌లో జరిగింది. ఇద్దరు వ్యోమగాములు స్పేస్‌వాక్‌కు వెళ్లి.. తిరికి ఐఎస్ఎస్‌కు వచ్చారు. చివరికి తాము టూల్ బ్యాగ్ పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని నాసా వెల్లడించింది.

New Update
NASA: అయ్యో.. అంతరిక్షంలో బ్యాగును పోగొట్టుకున్న వ్యోమగాములు..

సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పడు కొంతమంది పర్సులు, ఫోన్లు, బ్యాగులు, ఇతర వస్తువులు పొగొట్టుకుంటారు. కానీ తాజాగా అంతరిక్షంలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. వ్యోహగాములు తమ టూల్‌ బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) చోటుచేసుకుంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వేళ్తే.. నవంబర్ 1న ఐఎస్‌ఎస్‌లో ఆస్ట్రోనాట్స్ అయిన మేజర్‌ జాస్మిన్ మోఘ్‌బెలి, లోరాల్ ఓహార తొలిసారిగా స్పేస్ వాక్ చేశారు. అయితే వీళ్లు ఐఎస్ఎస్ బయట అంతరిక్షంలో సుమారు 6.42 గంటల పాటు గడిపారు. అయితే అదే సమయంలో వారు అంతరిక్ష కేంద్రం హ్యాండిలింగ్‌ బార్‌ను తొలగించి దానిలో బేరింగ్‌ను రిప్లేస్‌ చేశారు.

Also read: ఇలా రెండు బాల్స్ ఇచ్చుంటే సచిన్ డబుల్ పరుగులు చేసేవాడు..

ఆ తర్వాత వారు స్పేస్ స్టేషన్‌కి వచ్చారు. కొద్ది సేపటికి ఏదో మర్చిపోయినట్లు గుర్తించారు. చివరికి అది టూల్ బ్యాగ్ అని తేలిసింది. దీనిపై స్పందించిన నాసా.. మా కార్యకలాపాల్లో భాగంగా ఓ టూల్ బ్యాగ్‌ను పోగొట్టుకున్నామని చెప్పింది. అయితే ఈ బ్యాగ్ అన్ని స్పేస్ వాక్‌లకు అవసరం లేదని చెప్పింది. అలాగే ఈ బ్యాగ్ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొనే ముప్పు కూడా కొంచెం ఉందంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యాగ్ భూమికి 250 మైళ్ల ఎత్తున అంతరిక్షంలో తిరుగుతోంది. అయితే ఆ టూల్ బ్యాగ్‌ అంతరిక్షంలో కొన్ని నెలల పాటు తిరిగి మెల్లగా విచ్ఛిన్నమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ బ్యాగ్‌లో ఎలాంటి టూల్స్ ఉన్నాయనే దాని గురించి నాసా చెప్పలేదు. ఇదిలా ఉండగా.. 2008లో కూడా ఆస్ట్రోనాట్స్ స్పేస్‌ వాక్‌కు వెళ్లిన సమయంలో టూల్‌ బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ప్రస్తుతం అంతరిక్షంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి దాదాపు 35 వేలకు పైగా వ్యర్థాలు ఉన్నట్లు ఐరోపా స్పేస్ సంస్థ తెలిపింది.

Also Read: ఒక్క రోజు నైట్ అవుట్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా! సూపర్ సీక్రెట్ బయటపెట్టిన నిపుణులు

Advertisment
Advertisment
తాజా కథనాలు