Instagram: ఆ దేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధం.. వినియోగదారుల కొంపముంచిన అధికారి విమర్శలు!

టర్కీ దేశం సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించింది. దివంగత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించేందుకే టర్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై టర్కీ నుంచి అధికారిక ప్రకనట వెలువడలేదు.

New Update
Instagram: ఆ దేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధం.. వినియోగదారుల కొంపముంచిన అధికారి విమర్శలు!

Instagram Suspend in Turkey: టర్కీ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించకపోగా నిషేధం ఎంతకాలం అమలులో ఉంటుందో కూడా స్పష్టతనివ్వలేదు. కానీ హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత అతనికి సంబంధించిన కంటెంట్‌ను తీసివేయడానికి టర్కీ ఇన్‌స్టాగ్రామ్‌ని బ్లాక్ చేసిందనే తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: TG SET: ప్రొఫెసర్, లెక్చరర్‌ అభ్యర్థులకు అలర్ట్.. టీజీ సెట్‌ పై కీలక అప్ డేట్!

ఇటీవల హమాస్ చీఫ్‌పై సంతాప సందేశాన్ని తొలగించినందుకు మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌ను సీనియర్ టర్కిష్ అధికారి విమర్శించారు. 'ఇది పూర్తి సెన్సార్‌షిప్' అంటూ టర్కిష్ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. టర్కీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ అథారిటీ ఈ నిర్ణయాన్ని తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ఈ నిషేధం లేదా ఆల్టున్ వ్యాఖ్యలపై మెటా నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రెస్పాన్స్ లేకపోవడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు