Thummala: ఈరోజే కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వర్రావు-బీఆర్ఎస్ కు రాజీనామా

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో తుమ్మలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

New Update
Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల

బీఆర్ఎస్ నుంచి పాలేరు అస్లెంబ్లీ టికెట్ కోసం ఆశపడి భంగపడ్డ తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు. హైదరాబాద్ లో జరిగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటూ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు..ఇతర ముఖ్యనేతలూ హాజరుకానున్నారు. వీరి సమక్షంలో తుమ్మలు ఈరోజు కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మారనున్నాయి. దీంతో పాటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి.

రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వర్రావుకు మంచి పేరు ఉంది. అభివృద్ధి మాంత్రికుడని స్థానికంగా పేరు ఉంది.ఇదే స్టేటస్ తో బీఆర్ఎస్ లో టికెట్ ఆశించారు తుమ్మల. కానీ ఆ పార్టీ అధినేత సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో నిరాశ చెందారు. దీంతో ఆయన కాంగ్రెస్ బాట పట్టారు. వచ్చే ఎన్నికల్లో తుమ్మల పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ మేరకు రంగం కూడా సిద్ధం అవుతోందని అంటున్నారు.

మరోవైపు BRSకు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత BRSలో చేరిన తుమ్మల... 2016 ఉపఎన్నికలో పాలేరు నుంచి  BRS తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి  BRSలో చేరడంతో తుమ్మలకు  ప్రాధాన్యత తగ్గింది.

ఈసారి కూడా పాలేరును కందాలకే కట్టబెట్టడంతో BRSపై తుమ్మల తీవ్ర నిరాశ చెందారు. దీంతో కాంగ్రెస్ చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు