Crime News: టిక్కెట్ అడిగిన టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు

కేరళలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. టికెట్‌ చూపించమని అడిగిన టీటీఈని రైలు నుంచి కిందకి తోసేశాడు. దీంతో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు టీటీఈని ఢీకొనడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

New Update
Crime News: టిక్కెట్ అడిగిన టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు

కేరళలో దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. టిక్కెట్‌ అడిగిన టీటీఈని బయటికి తోసేయడం కలకలం రేపింది. దీంతో ఆ టీటీఈ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంతకి అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎర్నాకుళం - పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో రజనీకాంత్‌ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. ఎస్‌ 11 కోచ్‌లో టీటీఈ వినోద్‌.. ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేస్తూ వస్తున్నాడు.

Also Read: భారీ అగ్ని ప్రమాదం.. 58 ఇళ్లు ఆహుతి!

దీంతో రజనీకాంత్‌ను కూడా టిక్కెట్‌ చూపించమని అడిగాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య వివాదం జరిగింది. రజనీకాంత్ కోపంతో.. వేగంగా వెళ్తున్న ఆ రైలు నుంచి టీటీఈని కిందకి తోసేశాడు. టీటీఈ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని రైల్వే పోలీసులు వెల్లడించారు.

ఇక ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రజనీకాంత్‌ టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణిస్తున్నాడు. టీటీఈ వినోద్.. అతడిని టిక్కెట్ అడిగాడు. దీంతో వీళ్లద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో డోర్‌ దగ్గర నిలుచున్న రజనీకాంత్‌.. టీటీఈని రైలు నుంచి కిందకి తోసేశాడు. ఇంతలోనే అటువైపు నుంచి వస్తున్న మరో రైలు టీటీఈని ఢీకొట్టడంతో.. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి రజనీకాంత్‌ను పాలక్కడ్‌ అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read: ఆరెంజ్‌ అలర్ట్‌లో తెలంగాణ.. అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

Advertisment
Advertisment
తాజా కథనాలు