TTD:తిరుమల భక్తులకు అలర్ట్..మారిన టీటీడీ వెబ్‌సైట్ టీటీడీ వెబ్ సైట్ మారింది.ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్ పేరు thirupathibalaji.ap.gov.in ఉన్న దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.ఇక మీదట నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని చెబుతున్నారు. By Manogna alamuru 09 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Website:వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్ సైట్, వన్ మొబైల్ యాప్‌లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్‌సైట్ పేరులో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని కనిపించే వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in గా మారుతోంది. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలన్న ఉద్దేశంతోనే అధికారిక వెబ్‌సైట్‌ను మార్చినట్లు అధికారులు చెప్పారు. ఇక నుంచి ఆన్‌లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని అంటున్నారు. Also Read:పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. మరోవైపు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16న పార్వేట, గోదాపరిణయోత్సవాల కారణంగా స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. సంక్రాంతి పండగని పురస్కరించుకొని తిరుపతి గోవింద రాజస్వామి వారి ఆలయంలో 14న భోగితేరు, 15న సంక్రాంతి తిరుమంజనం, 16న గోదాకల్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు... టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తూ గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. నిన్న రెండో విడతగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి...ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలను అందజేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీకి, ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు త్వరలోనే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక ఇళ్ల స్థలాలకు సంబంధించి ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు ఈవో ధర్మారెడ్డి. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, టీటీడీ సొమ్ము చెల్లించి కొనుగోలు చేసి ఉద్యోగులకు అందిస్తోందని, కోర్టు కేసులు ఉండవని స్పష్టం చేశారు. రెండో విడతలో మొత్తం 1703 మందికి ఇళ్ళ స్థలాలు కేటాయించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా.. ఏర్పేడు వద్ద ఈ నెలాఖరు లోపు 450 ఎకరాలను ప్రభుత్వం నుండి స్వాధీనం చేసుకుని మూడో విడతలో రిటైర్డ్ ఉద్యోగులకు, ఉద్యోగులకు అందిస్తామన్నారు. అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. #tirupathi #tirumala #ttd #website మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి