TSRTC: గత 45 రోజుల్లో ఆర్టీసీలో ఎంతమంది మహిళలు ప్రయాణించారంటే: సజ్జనార్ తెలంగాణలో గత 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. నాంపల్లి తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. By B Aravind 28 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఎంతోమంది మహిళలు ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకున్నారు. అయితే గత కొన్ని రోజుల్లో ఎంతమంది మహిళలు బస్‌లో ప్రయాణించారనే దానిపై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పందించారు. గత 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. Also Read: కేసీఆర్ చాలా డేంజర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు వికలాంగుల సీట్లలో మహిళలు నాంపల్లిలో తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215 జయంతి వేడుకల్లో సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల వికాలాంగులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చుంటున్నారని అన్నారు. ప్రస్తుతం వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు నా దృష్టికి వచ్చినట్లు చెప్పారు. త్వరలో కొత్త బస్సులు త్వరలోనే 2,375 నూతన బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులకు కొంత వెసులుబాటు కూడా వస్తుందని.. అవసరమైతే వికలాంగుల కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేలా ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే అనౌన్స్‌మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో వికలాంగులకు కూడా అవకాశం కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. Also read: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో కీలక పరిణామం #telugu-news #tsrtc #sajjanar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి