Watch Video: ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం.. స్పందించిన సజ్జనార్ హైదరాబాద్ శివారులో రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎక్స్‌లో స్పందించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. By B Aravind 16 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ శివారులో రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుపై కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అయితే దీనిపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) లో స్పందించారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్తున్న తమ బస్సులపై కారణాలు లేకుండా దాడులు చేయడాన్ని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ మహేశ్వరం పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. Also read: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. బస్సుల ప్రజల ఆస్తి అని.. వాటిని రక్షించుకోవాల్సింది కూడా ప్రజలేనని సజ్జనార్ అన్నారు. పోలీసుల సహాకారంతో నిందితులపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని.. బస్సు డ్యామేడీ ఖర్చులు వారి నుంచి వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. Also read: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు! హైదరాబాద్ శివారులోని రాచలూరు గేట్ వద్ద కల్వకుర్తి డిపోనకు చెందిన #TSRTC బస్సుపై ఇవాళ కొందరు దుండగులు బైక్‌లపై వచ్చి దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. ప్రజలను నిత్యం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న తమ… pic.twitter.com/M4UZiZP1Oi — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 16, 2024 #telugu-news #tsrtc #sajjanar #tsrtc-md-sajjanar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి