TSRTC Free Journey Scheme: మహిళల ఫ్రీ జర్నీకి ఆ కార్డు చెల్లదు.. సజ్జనార్ కీలక ప్రకటన!

మహాలక్ష్మి స్కీంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. మహిళలు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డును చూపి ప్రయాణించాలన్నారు. స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తే చెల్లదన్నారు. పాన్ కార్డు కూడా చెల్లదన్నారు.

New Update
TSRTC Free Journey Scheme: మహిళల ఫ్రీ జర్నీకి ఆ కార్డు చెల్లదు.. సజ్జనార్ కీలక ప్రకటన!

TSRTC Free Journey Scheme: తెలంగాణలోని (Telangana) పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) కీలక ప్రకటన చేశారు. "మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం" వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆ గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని వివరించారు. పాన్‌ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదన్నారు సజ్జనార్ (Sajjanar).
ఇది కూడా చదవండి: TS Government: ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్‌ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్ లు చూపిస్తున్నారని TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. మహిళా ప్రయాణికులందరూ తమ ఒరిజనల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌ ను తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
publive-image

ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరారు. ఇంకా.. 'ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని. ఇది సరికాదన్నారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందని వివరించారు.

జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని అన్నారు. కావున బస్సు ఎక్కగానే ప్రతీ మహిళ జీరో టికెట్‌ను తీసుకోవాలని కోరారు. ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందననారు. టికెట్ లేని వారికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని కోరారు సజ్జనార్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Earthquake: మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ భూ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. హిందూకుష్ ప్రాంతంతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

Also Read :  కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

  • Apr 16, 2025 09:20 IST

    షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్‌ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారంట్లు జారీ చేసింది.

    sheikh Hasina
    sheikh Hasina

     



  • Apr 16, 2025 09:19 IST

    ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

    ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

    EC



  • Apr 16, 2025 07:26 IST

    పోలీసింగ్‌లో నెంబర్‌ వన్‌గా తెలంగాణ..

    తెలంగాణలో పోలీసుశాఖ పనితీరు దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ‘ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌-2025’ పేరుతో టాటా ట్రస్ట్‌ మంగళవారం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.



  • Apr 16, 2025 07:25 IST

    కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?



  • Apr 16, 2025 07:25 IST

    మరో చోట భారీ భూకంపం.. ఢిల్లీ ప్రజలను భయపెట్టిన ప్రకంపనలు

    అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్‌ మెడిటేరియన్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

    earthquake



Advertisment
Advertisment
Advertisment