TSRTC: ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఒక్కరోజులోనే ఎంతంటే.. సంక్రాంతి పండుగ వేళ.. తెలంగాణలో ఆర్టీసీకీ ఒక్కరోజులోనే సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావించిన ఆర్టీసీ మొత్తంగా 6,621 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. By B Aravind 16 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSRTC: సంక్రాంతి పండుగ వేళ.. రాష్ట్రంలోని ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతుర్లకు వెళ్లిపోయారు. 13వ తేదీన ఏకంగా 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. దీంతో ఆర్టీసీకి (TSRTC) ఆ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు కూడా 9 కోట్ల వరకు దాటినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన 28 లక్షల మంది ప్రయాణించగా.. 12న 28 లక్షలు, 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు చెప్పారు. Also Read: అందుకే విచారణకు రావడం లేదు.. ఈడీకీ లేఖ రాసిన కవిత.. అయితే పండుగల వేళ మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు ముందుగానే ఊహించారు. ఇందుక తగ్గట్లుగానే ప్రణాళికలు వేశారు. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా అయింది. దీంతో ఈనెల 11, 12,13 తేదీల్లోనే 4,400 వరకు ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతి (Sankranthi) పండుగకు ఏకంగా 6,261 బస్సులు నడిపినట్లు వివరించారు. Also Read: అయోధ్య రాముడిని హెలీకాప్టర్లో తిరుగుతూ చూసేయొచ్చు.. #telugu-news #telangana-news #tsrtc #sankranthi-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి