TS Politics: కాంగ్రెస్ లోకి జలగం వెంకట్రావు.. అక్కడి నుంచి బరిలోకి?

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
TS Politics: కాంగ్రెస్ లోకి జలగం వెంకట్రావు.. అక్కడి నుంచి బరిలోకి?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (Jalagam Venkatrao) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు లేదా రేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుతో కలిసి ఇప్పటికే మల్లికార్జున్ ఖర్గేను కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జలగం వెంకట్రావు 2004లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం సత్తుపల్లి సీటు ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Voter Registration: నేటితో ముగియనున్న తెలంగాణ ఓటరు నమోదు గడువు

తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన ఒక్కరే విజయం సాధించారు. అయితే.. 2018లో టీఆర్ఎస్ నుంచి మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వనమా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వనమాకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో జలగం అసంతృప్తితో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే జలగానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వగా.. వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఇందుకు సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. జలగం వెంకట్రావుకు కాంగ్రెస్ కొత్తగూడెం టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కానీ, పొత్తులు కుదరని పక్షంలో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావును బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు