Trivikram: డైరెక్టర్‌ గా ఎంట్రీ ఇస్తున్న మాటల మాంత్రికుని తనయుడు!

త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్‌ డైరెక్టర్‌ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్‌ కుమారుడు రిషి కోసం సోషల్‌ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు.

New Update
Trivikram: డైరెక్టర్‌ గా ఎంట్రీ ఇస్తున్న మాటల మాంత్రికుని తనయుడు!

తెలుగు సినీ ప్రపంచంలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గురించి తెలియని వారు ఉండరు. తన మాటలతో, సినిమాలతో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్‌. ముందు మాటల రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తరువాత దర్శకునిగా మారి తనదైన ముద్రను సినీ జగత్‌ మీద వేశారు.

publive-image

ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది. అటు మాస్‌, క్లాస్‌చ యాక్షన్‌ , ఫ్యామిలీ డ్రామా..ఇలా ఏదైనా సరే అందులో త్రివిక్రమ్‌ ప్రత్యేకత కచ్చితంగా కనిపిస్తుంది. ఆయన రాసే ఒక్కో మాట ఒక్కో గన్‌ షాట్‌ అని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్‌ కుటుంబం ఎప్పుడూ కూడా మీడియాకి దూరంగా ఉంటారు.

Also read: కొండ చిలువతో సెల్ఫీ కావాలన్నాడు..కానీ చివరికి ఏమైందంటే!

ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్‌ డైరెక్టర్‌ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్‌ కుమారుడు రిషి కోసం సోషల్‌ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు.

అయితే రిషికి సంబంధించిన ప్రతి అకౌంట్‌ కూడా ప్రైవేట్‌ లో ఉంది. కానీ రిషి ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అది ఎలాగా అంటే సిరివెన్నెల తనయుడు రాజా త్రివిక్రమ్‌ భార్యకు తమ్ముడు అవుతారనే విషయం తెలిసిందే. ఎప్పుడైతే రిషి డైరెక్టర్‌ గా వస్తున్నాడు అని ఆమె తెలిపారో..వీరు ముగ్గురు దిగిన ఫోటోను ఒకదానిని ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

Also read: ఆ రాష్ట్రంలో వర్షాలకు నీట మునిగిన రోడ్లు..మరో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

రిషి ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్‌ ఎలా చేయాలో తెలుసుకుంటున్నాడని త్రివిక్రమ్‌ భార్య తెలిపారు. రాజా పెట్టిన ఫోటోను చూసిన అభిమానులు అంతా కూడా రిషి అచ్చం తండ్రిలాగానే ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేష్‌ తో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Also read: ఈ ఏడాది దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 23న లేక 24న?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment