Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం ముగిసింది. మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజు కావడంతో శనివారం ఒక్కరోజే 166 మంది దరఖాస్తులు చేసుకున్నారు. By B Aravind 03 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Alliance of India : దేశంలో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మళ్లీ మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ(BJP) ప్రయత్నిస్తుండగా.. మోదీ సర్కార్(Modi Sarkar) ను గద్దె దించే దిశగా ఇండియా కూటమి(Alliance Of India) తో సహా విపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మరో రెండు, మూడు నెలల్లోనే ఈ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. Also read: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. వారికి నో ఛాన్స్.. మొత్తం 306 అప్లికేషన్లు అయితే విపక్ష పార్టీల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్(Congress Sarkar) ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు ఈరోజు (శనివారం) సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. Also read: రాహుల్ పోరాటం ఫలించకపోతే జరిగేది అదే.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు ఒక్కరోజే 166 మంది దరఖాస్తు అయితే చివరిరోజు కావడంతో ఈరోజు ఏకంగా 166 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సతీమణి నందిని, భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యాక్షురాలు బండ్రు శోభారణి, సికింద్రాబాద్ నుంచి డాక్టర్ రవీందర్ గౌడ్‌లు దరఖాస్తు చేసుకున్నారు. ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కొడుకు గడ్డం వంశీ, వరంగల్ నుంచి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. #telangana-news #congress #bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి