World Cup 2023: ఈరోజు మ్యాచ్‌లో టాసే హీరోనా? వాంఖడే రికార్డులు ఏం చెబుతున్నాయి? వరల్డ్‌కప్‌లో సెమీస్ సమరానికి ఈ రోజు తెరలేవనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు టాసే హీరో కానుందా..టాస్ గెలిచిన వారే మ్యాచ్ గెలుస్తారా..ప్రీవియస్ మ్యాచ్‌ల హిస్టరీ చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. By Manogna alamuru 15 Nov 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India vs New Zealand Semi Final: ముంబై వాంఖడే స్టేడియం (Wankhede Stadium) బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించే పిచ్. ఇక్కడ పరుగుల వరద పారుతుంది. ఇక్కడ జరిగిన చాలా మ్యాచ్‌లలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నవారే గెలిచారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో (World Cup 2023) భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి మరీ బౌలింగ్ ఎంచుకుంది. దానికి భారీ మూల్యమే చెల్లించుకుంది కూడా. దాని ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయింది. అయితే ఇదే స్టేడియంలో ఆస్ట్రేలియా మాత్రం ఆఫ్ఘాన్ మీద గెలిచింది. 292 రన్స్ చేధించి మరీ గెలిచింది. దానికి కారణం మాక్స్ వెల్ సూపర్ ఇన్నింగ్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 280+ కొట్టిన టీమ్ కేవలం ఓడిపోయింది కూడా ఈ ఒక్క మ్యాచ్ లోనే. Also Read:భారత్-న్యూజిలాండ్…ఇవాళ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది? దీన్ని బట్టి వాంఖడే స్టేడియంలో టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని అర్ధమవుతోంది. కాబట్టి ఇరు జట్లు టాస్ గెలిస్తే కచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకుంటాయి. ఈ మైదానంలో మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. బౌండరీ చిన్నదిగా ఉండటంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాది భారీ స్కోర్లు కొట్టడం కూడా అవుతుంది. మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే మిగతా పనిని బౌలర్లు చూసుకుంటారు. ఎందుకంటే ఈ స్టేడియంలో పిచ్ మొదట బ్యాటింగ్‌కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్‌లో పేస్ బౌలింగ్‌కు అంతగానే అనుకూలిస్తుంది. ఈ విషయం కూడా మన టీమ్ కు బాగా తెలిసినదే. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ దీన్ని ఛేధించే క్రమంలో భారత పేసర్లు షమీ (5/18), సిరాజ్ (3/16), బుమ్రా (1/8) రెచ్చిపోయి లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చారు. వీటన్నింటి బట్టి ఏ టీమ్ అయినా టాస్ గెలిచిందా...సగం మ్యాచ్ గెలిచినట్టే. దీనికి తోడు మన హీరో కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. వాంఖడే స్టేడియంలో తాను చాలా మ్యాచ్ లు ఆడానని...టాస్ తో పెద్దగా భయపడక్కర్లేదని అంటున్నాడు. అసలే లీగ్ దశలో వరుసగా మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంలో ఉన్నాడేమో సెమీస్ మ్యాచ్‌కు కూడా అదే ఊపుతో రెడీ అవుతున్నాడు. పులి ఎక్కడాడినా...పులే అంటున్నాడు రోహిత్ ద హిట్ మ్యాన్. #cricket #india #match #newzealand #icc-world-cup-2023 #semis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి