Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ
భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.
భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.
రేపు, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. దీని కంటే ముందు రష్యా కీలక ఒప్పందంపై ఆమోదం తెలిపింది. సైనిక కార్యకలాపాలు, విన్యాసాలు, విపత్తు సహాయానికి పరస్పర లాజిస్టికల్ మద్దతును కల్పించే కీలకమైన సైనిక ఒప్పందానికి అంగీకరించింది.
శ్రీలంకకు సహాయం అందిస్తున్న తమ దేశ విమానానికి ఇండియా ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అబద్ధాలు చెప్పే పాక్ బుద్ధి ఎప్పటికీ మారదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా ఈ రోజు రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఉత్సాహంలో రెండోది కూడా గెలిచి..సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమ్ ఇండియా. మరోవైపు సఫారీలు కూడా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్లను సమం చేసుకోవాలని చూస్తోంది.
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడంపై క్రెమ్లిన్ లో అమెరికా, రష్యాలు ఈ రోజు చర్చలు జరిపాయి. అయితే ఇందులో ఎటువంటి పురోగతి మాత్రం సాధించలేదు. మాస్కో తనదని చెప్పుకునే కైవ్ భూభాగాన్ని అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేశారు.
వారం రోజులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ పీటీఐ ఈరోజు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దీంతో రావల్పిండిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడ 144 సెక్షన్ విధించారు.
బంగ్లాదేశ్ కు మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఖాలిదా జియా ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేషన్ పై ఉన్నారు. జియా ఆరోగ్యంపై భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
వెనిజులా అధ్యక్షుడు మదురో వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. దీనికి సమాధానంగా తాను దేశం నుంచి వెళ్ళిపోతానని..కానీ కొన్ని షరతులు మాత్రం అంగీకరించాల్సిందేనని మదురో అన్నారు.