తెగబడ్డ సైబర్ దొంగలు.. ఏకంగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్!

సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను కొందరు దుండగులు హ్యాక్ చేశారు. సుప్రీం కోర్టు ఇండియా పేరుతో ఉండే ఛానల్‌ను రిప్పల్ అని మార్చారు. ఇందులో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు కాకుండా.. క్రిప్టో కరెన్సీ కంటెంట్ గురించి వస్తున్నాయని గుర్తించారు. హ్యాక్ అయిన కంటెంట్ రికవరీ, ఎవరూ హ్యాక్ చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టింది.

author-image
By Manoj Varma
New Update
Supreme Court on Promotions: ప్రమోషన్స్ విషయంలో అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు 

Supreme Court

Supreme Court Youtube Channel Hack : ఈ మధ్య కాలంలో  సైబర్ క్రైం, అకౌంట్లు హ్యాక్ వంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ కావడం సంచలనంగా మారింది. హ్యాకర్లు ఏకంగా సుప్రీం కోర్టు ఇండియా అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను పేరును రిప్పల్ అని మార్చారు. సాధారణంగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌లో రోజూ కోర్టు లైవ్, తీర్పుల గురించి కంటెంట్ వస్తుంది. కానీ ఈరోజు వాటి స్థానంలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో అకౌంట్ హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.

ఎవరు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు? ఎందుకు చేశారు? ఏదైనా కుట్ర కోణం ఉందా? అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. మరో వైపు హ్యాక్ గురైన ఛానల్ ను పునరుద్ధరించడానికి.. అందులోని కంటెంట్ డిలీట్ కాకుండా ఉండేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇందుకు కారణమైన వారిని గుర్తించాలన్న లక్ష్యంతో వారు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ukraine: భారత కంపెనీలపై రష్యా దాడులు

కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
ukraine

Russia Attacks On Indian Medicine Warehouse

ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ఇండియన్ డ్రగ్ కంపెనీ గోడౌన్ పై  శనివారం రష్యా దాడి చేసింది. కుసుమ్ అనే కంపెనీకి చెందిన స్టోరేజ్ పై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. రష్యా కవాలానే భారతీయ కంపెనీల మీద దాడులు చేస్తోందని ఆరోపించింది. ఉక్రెయిన్ కు నష్టం జరగాలంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాటి కొరత తీసుకురావాలని రష్యా భావిస్తోంది. అందుకే పిల్లలు, వృద్ధుల కోసం మందులు నిల్వ చేసే గోడౌన్స్ పై రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం విమర్శించింది. భారత్ తో స్నేహం ఉందని చెప్పే రష్యా ఇలా టార్గెట్ చేసి మరీ ఎందుకు దాడులు చేస్తోందని ప్రశ్నించింది. 

ఈ దాడిని ఉక్రెయిన్ లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా ధృవీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. కుసేమ్ హెల్త్ కేర్ ఉక్రెయిన్ తో పాటూ 29 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

 today-latest-news-in-telugu | russia | ukraine | indian | medicine 

Also Read: Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

Advertisment
Advertisment
Advertisment