Hyderabad : హైదరాబాద్ వాసులకు అలెర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ హైదరాబాద్‌లో ప్రాంతాలకు రేపు నీరు బంద్ కానుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు లీకేజ్ ఏర్పడింది. దీన్ని బాగు చేయడానికి 18 గంటలపాటూ నీటిని బంద్ చేయనున్నారు. By Manogna alamuru 08 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి No Water For 18 Hours : హైదరాబాద్(Hyderabad) వాసులకు జీహెచ్ఎంసీ అలర్ట్(GHMC Alert) జారీ చేసింది. రేపు 18 గంటలపాటూ తాగునీరు రాదని(Water Bandh) చెప్పింది. నగరానికి నీటి సరఫరా చేసే పంపుల్లో లీకేజీ సమస్యలు ఏర్పడ్డాయి. వీటిని తక్షణమే బాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ లీకేజీ సమస్యను పరిష్కరించేందుకు శనివారం ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల నీటి సరఫరాను ఆపనున్నారు. ఉస్మాన్‌సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు లీకేజ్ ఏర్పడింది. ఈ ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు.. హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో రేపు తాగునీరు బంద్ కానుంది. విజయ్‌నగర్ కాలనీ, హుమయూన్ గర్, కాకతీయ, నగర్, సయ్యద్ నగర్, ఎంఈఎస్, బజార్‌ఘాట్, ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్,ఇన్‌కమ్ టాక్స్ ఏరియా, సెక్కటేరియట్, సీఐబీ క్వార్ట్ర్స్, ఇందిరానగర్, బీజేఆర్ కాలనీ, అడ్వకేట్ కాలనీ, మిల్స్ కాలనీ, గోకుల్ నగర్..నాంపల్లి రైల్వే స్టేషన్, జంగం బస్తీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకపూల్, సీతారాంబాగ్, గన్ ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, అబీడ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎల్బీ స్టేడియం, బీఆర్‌కె భవన్, బిర్లా మందిర్, హిందీ నగర్, దోమల్‌గూడ, గాంధీనగర్, ఘోడే కాబ్ర్, ఎమ్మెల్యే కాలనీ, తట్టి ఖానా, నూర్‌నగర్ ప్రాంతాలకు నీటి అంతరాయం ఏర్పడనుంది. దాదాపు రెండు రోజులు నీరు ఉండదు కాబట్టి నీటి పొదుఉపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. Also Read : Telangana : ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ #telangana #hyderabad #ghmc #no-water మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి