NHAI : వాహనాదారులకు అలెర్ట్.. పెరగనున్న టోల్‌ప్లాజా ఛార్జీలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజులు పెరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. NHAI ఇందుకు సంబంధించి టోల్‌ప్లాజాల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 22 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Toll Plaza Charges Hike : జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్‌ప్లాజాల వద్ద టోల్ ఫీజులు (Toll Fees) పెరగనున్నాయి. జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న రుసుములు పెరగనుండగా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) జరుగుతున్న నేపథ్యంలో ఇది వాయిదా పడింది. ఎన్నికలకు ముందే ఎలక్షన్ కమిషన్.. టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు ముగిశాక వీటి ఛార్జీలు పెరగనున్నాయి. Also Read: తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు.. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల్లో పోలింగ్ (Polling) పూర్తయింది. ఇంకా రెండు దశలు మిగిలి ఉన్నాయి. మే 25, జూన్ 1న ఎన్నికలు జరనున్నాయి. అయితే జూన్ 1తో ఎన్నికలు ముగియనుండగా.. ఆరోజు అర్ధరాత్రి నుంచి టోల్ ధరలు పెరగనున్నాయి. NHAI ఇందుకు సంబంధించి ఇప్పటికే టోల్‌ప్లాజాల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ ఛార్జీలు పెంపు సగటున 5 శాతం పెంచుతారు. Also Read: జూన్ మొదటి వారంలోగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు! #telugu-news #lok-sabha-elections #nhai #toll-plaza మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి