Hyderabad doctors:ఏడు నెలల చిన్నారికి లివర్ ఆపరేషన్..హైదరాబాద్ వైద్యుల ఘనత

హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడు నెలల చిన్నారికి ఆక్సలరీ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు.

New Update
Hyderabad doctors:ఏడు నెలల చిన్నారికి లివర్ ఆపరేషన్..హైదరాబాద్ వైద్యుల ఘనత

చూడటానికి అంతా బాగానే ఉంది...ఎక్కడా ఏ లోపం కనిపించడం లేదు కానీ ఆ బాబులో ఎదుగుదల లేదు. పుట్టి ఏడు నెలలు అవుతున్నా...తల నిలవడం లేదు. తిండి తినడం లేదు. దీంతో హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి పిల్లాడిని తీసుకువచ్చారు తల్లిదండ్రులు. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు చేసి బాబుకి ప్రపోనిక్ ఎసిడిమియా అనే సమస్య ఉన్నట్టు కనుగొన్నారు. ఇదొక రేర్ మెటాబాలిక్ లివర్ డిసీజ్. ఇది ఉన్న వాళ్ళ శరీరం ఫ్యాట్స్, ప్రొటీన్లను కలిగి ఉండదు, తీసుకోదు కూడా. దీని వలన ఫిట్స్ రావడం, శరీరంలో భాగాలు ఎదగకపోవడం లాంటివి జరుగుతాయి. పెరుగుతున్న కొద్దీ ఇది మరిన్ని జబ్బులకు దారి తీస్తుంది.

Also Read:బాగానే మాట్లాడుకున్నారుగా..మళ్ళీ ఈ ట్యాగ్ లేంటి బైడెన్?

లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వలన ప్రొపోనిక్ అసిడిమియా వస్తుంది. లివర్ పని చేస్తుంది కానీ పాక్సికంగానే చేస్తుంది. ఇది మందులతో సరి అయ్యేది కూడా కాదు. కేవలం లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ మాత్రమే పని చేస్తుంది. అయితే సాధారణంగా లివర్ ట్రాన్ ప్లాంటేషన్ అంటే ఉన్నదాన్ని తీసేసి కొత్తది అమర్చడం. కానీ ఇక్కడ పిల్లాడికి ఉస్మానియా వైద్యులు ఉన్నదాన్ని అలాగే ఉంచి అదనంగా మరొక లివర్ ను జత చేవారు. దాన్ని శరీరానికి అనుసంధానం చేశారు. దీన్ని ఆక్సిలరీ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అంటారు. ఉస్మానియా వైద్యులు డా. సీహెచ్ మధుసూదన్ అంకురా ఆసుపత్రి వైద్యులు అయిన డా. ప్రజిత్ త్రిపాఠి, గోవింద్ వర్మ, ప్రశాంత్, సంపత్ లతో కలిసి ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతం అయిందని...బాబు బాగానే ఉన్నాడని డాక్టర్లు చెబుతున్నారు. ఇదొక అరుదైన ఆపరేషన్ అని అంటున్నారు.

Also Read:“ఏనుగులు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లు”..అస్సలు ఓర్చుకోలేకపోతున్నారుగా

Advertisment
Advertisment
తాజా కథనాలు