Today Gold Price: తగ్గడం కష్టమేనేమో.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే.. నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,150ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,440ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర కేజీకి రూ.300లు పెరిగి రూ.78,300 వద్ద ఉంది. By KVD Varma 16 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Today Gold Price: బంగారం.. గతవారంలో కొద్దీ..కొద్దిగా పెరుగుతూ వచ్చిన బంగారం మళ్ళీ అదేధోరణిలో వెళుతోంది. బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. బంగారం కొనాలనుకునేవారిలో ఆందోళన పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం.. దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. నిన్న అంటే జనవరి 15న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు అంటే జనవరి 16న పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరల(Today Gold Price)తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 16న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate)స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు(Today Gold Price) పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే ఆదివారం (జనవరి 16) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో బంగారం ధరలు: హైదరాబాద్(Hyderabad) లో వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Today Gold Price) 150 రూపాయలు పెరిగింది. దీంతో రూ.58,150ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 170 రూపాయలు పెరిగి రూ. 63,440ల కు చేరుకుంది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(TGold Rate) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Today Gold Price) 150 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.58,300ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 170 రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.63,590ల వద్దకు చేరుకుంది. Also Read: బంగారం.. సంక్రాంతి రోజు స్టడీగా..వెండి కూడా నిలకడగా.. వెండి ధరలు ఇలా: ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Today Gold Price పెరుగుదల నమోదు చేస్తుంటే అదే బాటలో వెండి ధరలు కూడా ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 300 రూపాయలు పెరిగి రూ.78,300ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 300 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 76,800 లకు చేరుకుంది. అంతర్జాతీయంగా.. మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price) 2052.65డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.16 డాలర్లుగా ఉంది. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. #gold-price #silver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి