Titanic: ప్రేమనౌక మళ్ళీ వచ్చేస్తోంది..2027నాటికి టైటానిక్ టైటానిక్..దీన్ని ఎవరు మర్చిపోగలరు. పెద్ద ఐస్ కొండను గుద్దుకుని సముద్రంలో మునిగిపోయిన ఈ నౌక మాయం అయి ఇప్పటికి 112 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత టైటానిక్ మళ్ళీ రాబోతోంది. 2027 నాటికి దీనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. By Manogna alamuru 17 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి THe Big Ship Titanic: టైటానిక్ అనగానే మనకు గుర్తొచ్చేది సూపర్ లవ్. నిజంగా ఆనౌకలో అలాంటి ప్రేమ కావ్యం జరిగిందో లేదో తెలియదు కానీ దాని మీద వచ్చిన సినిమా మాత్రం మన మనసుల్లో చెరగని ముద్ర వేసింది. టైటానిక్ గురించి నేటి తరం కూడా తెలుసుకునేలా చేసింది. టైటానిక్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌక. ఇది సముద్రంలో పెద్ద మంచు గడ్డను ఢీకొట్టుకుని మునిగిపోయింది. ఆ తర్వాత ఆ టైటానిక్ షిప్‌ను చూసేందుకు వెళ్తుండగా పేలిపోయిన జలాంతర్గామి ప్రమాదం. టైటానిక్ నౌక మునిగిపోయి 110 ఏళ్లు దాటిపోయినా.. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఎవరూ భూమిపై బతికి లేకపోయినా ఇప్పటికీ ఆ ప్రమాదం, ఆ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లే ఉంటుంది. అందుకే ఇప్పుడు అలాంటి నౌకనే మరొక దాన్ని తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ బిలియనీర్ క్లైవ్ పాల్మర్.. టైటానిక్ లాంటిదే మరో నౌక నిర్మిస్తామని ప్రకటించారు. 2027 జూన్ నాటికి ఈ టైటానిక్ 2 నౌక ప్రయాణానికి సిద్ధమవుతుందని క్లైవ్ పాల్మర్ తెలిపారు. ఇది మొదటి టైటానిక్‌ను మించి ఉంటుందని చెప్పారు. టైటానిక్ అంటే కలల జలసౌధం అనీ..దాని గొప్పతనం ఎప్పటికీ నిలిచే ఉండాలని అంటున్నారు క్లైవ్. దానికోసమే తన తాపత్రయం అని అంటున్నారు. కొత్తగా తయారుచేసే టైటానిక్‌కు బిలియన్ డాలర్లు...అంటే 8300కోట్లు ఖర్చు అవనుంది. ఈ టైటానిక్ 2 నౌక నిర్మాణానికి ఈ ఏడాది జూన్ తర్వాత టెండర్లను పిలిచే అవకాశం ఉందని క్లైవ్ స్పష్టం చేశారు. ఆ టైటానిక్ 2 ను 2025 లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా.. ఈ ఏడాది చివరి నాటికి నౌక నిర్మాణ సంస్థను ఖరారు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక కొత్తగా నిర్మిస్తున్న టైటానిక్ షిప్‌లో 9 డెక్‌లలో మొత్తం 835 క్యాబిన్‌లు ఉండనున్నాయి. 2345 మంది ప్రయాణికులు ట్రావెల్ చేసేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు.ఇందులో దాదాపు సగం గదులను ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయనున్నారు. బాల్‌రూమ్, స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్‌రూమ్‌లతో నిర్మించనున్నారు.గతంలో ఉన్న టైటానిక్ షిప్‌లో ఉన్న ఇంటీరియర్స్, క్యాబిన్ లే అవుటే ఈ కొత్త దానిలో కూడా ఉండనున్నాయి. ఇక టైటానిక్ ప్రయాణించిన సౌతాంప్టన్- న్యూయార్క్ మార్గంలోనే ఈ టైటానిక్ 2 కూడా ప్రయాణించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. Also Read:Gold and Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు #australia #ship #new-york #titanic #rebuilting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి