Kerala:వాయనాడ్ లో రైతును చంపిన పులి...దాన్ని చంపాలన్న ప్రభుత్వం

కేరళ జిల్లా వాయనాడ్ లో ఓ రైతు పులి దాడిలో మరణించాడు. వాకేరి ప్రాంతంలో శనివార్ ప్రజీష్ అనే వ్యక్తిని పులి చంపేసింది. దీని మీద స్పందించిన కేరళ ప్రభుత్వం వెంటనే ఆ పులిని పట్టుకుని చంపాలని ఆదేశాలను జారీ చేసింది.

New Update
Kerala:వాయనాడ్ లో రైతును చంపిన పులి...దాన్ని చంపాలన్న ప్రభుత్వం

పశువుల గడ్డి కోసం పొలానికి వెళ్ళిన ప్రజీష్ అనే 36 వ్యక్తిని పులి చంపేసిన ఘటన కేరళ జిల్లా వాయనాడ్ లో వెలుగు చూసింది. వాకేరి జిల్లాలో మధ్యాహ్నం పొలానికి వెళ్ళిన ప్రజీష్ సాయంత్రం వరకు రాకపోవడంతో బంధువులు వెతకగా..అతని మృతదేహం కనబడింది. ప్రజీష్ ఎడమకాలు, తొడతో సహా తలలో కొంత భాగాన్ని కూడా పులి తినేసింది. ఈ ఘటన కిందట శనివారం జరిగింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖా అధికారులకు తెలియజేశారు. అంతకు ముందు కూడా ఇలానే ఓ 52 వ్యక్తిని పులి చంపి తినేసింది. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు , కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు.

Also Read:కవర్లకు కూడా డబ్బులు లేవా…వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్

రైతు మీద దాడి చేసిన పులిని వెంటనే చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతును చంపిన పులి మ్యాన్ ఈటర్ గా గుర్తించామని...అందుకే దాన్ని వెంటనే చంపాలని చెప్పింది. మరికొంత మంది చనిపోక ముందే చర్యలను తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతులు పొలాలకు దగ్గరు వెళ్ళడానికి భయపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేరళ ప్రభుత్వం చెబుతోంది.

Also Read:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది-ప్రధాని మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు