FOOD: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ

దేశంలో మూడు నగరాల నుంచి అత్యధికంగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు స్విగ్గీ నిర్వాహకులు. అందులో రెండు సౌత్‌వి కాగా ఒకటి నార్త్ నుంచి ఉంది. ఈ మూడు సిటీల్లో నాన్ వెజ్‌తో పాటూ అత్యధికగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు.

New Update
Year End 2023 : ఒక వ్యక్తి  ఈ ఏడాది స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిన డబ్బుతో డబుల్ బెడ్రూం కొనచ్చట.. ఎలానో తెలుసా?

Swiggy Veg Orders: కరోనా తరువాతనుంచి ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ తెగ ఊపందుకుంది. ఇల్లు కదలకుండా చేతిలోకి అన్నీ వచ్చి పడుతుండేసరికి చాలా మంది వీటి మీద ఆధారపడుతున్నారు. వీటివల్ల శ్రమ తప్పుతోంది. బోలెడు ట్రైమ్ కూడా ఆద అవుతోంది. అందుకే రోజురోజుకూ స్విగ్గ, జొమాటోలాంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ డెవలప్ అవుతూనే ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోలు రోజుకు లక్షలు, కోట్లలో వ్యాపారాలు చేస్తున్నాయి.

ఈ ఫుడ్ ఫామ్‌లు అప్పుడప్పుడు తమకొచ్చిన ఆర్డర్లను బట్టి సర్వేలను నిర్వహిస్తుంటాయి. తాజాగా స్విగ్గీ భారతదేశంలో ఏ నగరాల్లో ఎక్కువ మంది శాఖాహారం తినేవారు ఉన్నారు అనే సర్వే నిర్వహించింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబయ్‌ల నుంచి ఎక్కువగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతోంది స్విగ్గీ. అన్నింటికన్నా బెంగళూరును వెజ్జీ వ్యాలీ అంటోంది. దేశం మొత్తంలో వచ్చిన మూడు వెజ్ ఆర్డర్లల ఒకటి బెంగళూరు నుంచి తప్పుండా ఉంటుందని చెప్పింది. మసాలా దోస, పన్నీర్‌ బిర్యానీ, పన్నీర్‌ బటర్‌ మసాలాను ఎక్కువ తింటరని తెలిపింది. దీని తరువాత నార్త సిటీ అయిన ముంబయ్ రెండవ స్థానంలో నిలిచింది. దాల్‌ కిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్‌ భాజీని ఇక్కడ ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు. ఇక మూడో స్థానంలో హైదరాబాద్‌ వాసులు నిలిస్తే...ఇక్కడ నుంచి మసాలా దోస, ఇడ్లీలను బాగా ఎక్కువగా ఆర్డర్ చేసి తింటున్నారని చెప్పింది స్విగ్గీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు