అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసా వెల్లడించింది.
Asteroids Coming To Earth : అమెరికా (America) అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది. ఈ మూడు గ్రహశకలాలు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ మధ్య భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తాయని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వెల్లడించింది.
అవి భూమికి బాగా దగ్గరగా వస్తున్నప్పటికీ, వాటి నుంచి ముప్పు ఏమీ ఉండదని నాసా పేర్కొంది. ఈ మూడు గ్రహశకలాల్లో అన్నింటి కంటే పెద్దది కేహెచ్3-2024 అని, ఇది 610 అడుగులు ఉంటుందని నాసా వివరించింది. ఇది పొడవైన భవనం అంత పరిమాణంలో ఉంటుందని వెల్లడించింది. కేహెచ్3 గ్రహశకలం ఆగస్టు 10వ తేదీన భూమికి 5.6 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి వస్తుందని తెలిపింది.
మిగతా రెండు గ్రహశకాల్లో ఒకటైన పీకే1-2024... కేవలం 110 అడుగులతో ఓ చిన్న విమానం సైజులో ఉండొచ్చని, ఇది భూమికి 6.4 మిలియన్ కిలోమీటర్ల దగ్గరగా వస్తుందని నాసా అధికారులు వెల్లడించారు. దీంతో భూమికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది.
మూడో గ్రహశకలం (Asteroids) ఓఎన్2-2024 ఆగస్టు 12న భూమికి దగ్గరగా వస్తుందని, 120 అడుగులు ఉండే ఈ శకలం భూమికి 6.8 మిలియన్ కిలోమీటర్లు దగ్గరగా రానుందని నాసా వివరించింది. ఇది కూడా భూమిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు లేవని నాసా వివరించింది. అయితే ఎందుకైనా మంచిందని భూమి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు గ్రహశకలాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు నాసా వివరించింది.
🔴Live News Updates: తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలుచేపట్టినప్పటి నుంచి అమెరికా వలసదారులపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అక్రమంగా అమెరికాకు వచ్చిన వారిని వెంటాడి, వేటాడి, వేధించైనా అమెరికా నుంచి బయటకు పంపిస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారు, టూరిస్టు వీసాలపై వచ్చి దొంగచాటున అక్కడే ఉన్న వారు, చదువుకోవడానికి వచ్చి అక్రమంగా తలదాచుకుంటున్న వారిని పట్టుకుని మరీ బలవంతంగా వారి దేశాలకు పంపిస్తున్నారు.
అమెరికాలో ఎక్కువకాలం నివసించే విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇదివరకే హెచ్చరికలు జారీ చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ.. తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ గవర్న్‌మెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. నేరం కింద పరిగణించి జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఎవరికి వారు సొంతంగా అమెరికా విడిచి వెళ్లిపోవాలని అధికారికంగా తెలిపింది.
సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని, ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని.. సామాను సర్దుకుని బయల్దేరి విమానం ఎక్కండి అంటూ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఇలాంటి వారిలో విమాన టికెట్ సొమ్మును భరించలేని వారు ఉంటే.. వారికి టికెట్ సొమ్ములో రాయితీ ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
30 రోజులకు మించి అమెరికాలో ఉన్న వారు రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి వెళ్లగొడతామని తేల్చి చెప్పింది. దాంతో పాటు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు అధికంగా దేశం ఉన్నా.. రోజుకు రూ.86 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని వివరించింది. సొంతంగా దేశం వీడకపోతే గరిష్ఠంగా రూ.4.30 లక్షలు ఫైన్ వేయనున్నట్లు మరోసారి గుర్తు చేసింది.
జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని వివరించింది. జరిమానా కట్టే వారు, జైలు శిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతారని వెల్లడించింది.హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజా నిబంధనలు హెచ్1బీ, విద్యార్థి పర్మిట్లపై ఉండే వారికి వర్తించబోవు. అయితే సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని కచ్చితంగా అమలు చేయనున్నారు.
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.
lsg vs csk Photograph: (lsg vs csk)
Apr 14, 2025 20:39 IST
వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
Apr 14, 2025 20:38 IST
LSG Vs CSK: లక్నో జట్టుకు కళ్లేం వేస్తున్న CSK బౌలర్లు.. 10 ఓవర్ల స్కోర్ ఎంతంటే?
Apr 14, 2025 20:38 IST
CSK vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..
Apr 14, 2025 20:22 IST
భూ భారతి పోర్టల్ ప్రారంభం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లో శిల్పకళా వేదికగా సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పోర్టల్‌ను మూడు మండలాల్లో అమలు చేయనున్నారు.
Bhu Bharati Portal inauguration
Apr 14, 2025 18:19 IST
అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అందరికి బంగారు లాకెట్లు!
ట్రావెన్‌కోర్ దేవస్థానం అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ ప్రారంభించారు. అయితే మొదట ఈ బంగారు లాకెట్‌ను ఆన్‌లైన్‌లో ఏపీకి చెందిన వ్యక్తి బుక్ చేసుకున్నాడు.
Sabarimala gold lockets
Apr 14, 2025 18:18 IST
వర్షిణి నువ్వొక ఆడదానివైతే.. అఘోరీ మొదటి భార్య సంచలన సవాల్
అఘోరీ మొదటి భార్య శ్రీవర్షిణికి సవాల్ విసిరింది. ‘‘నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతానని వర్షిణి చెప్పింది. వర్షిణి నిజంగా ఆడపిల్లే అయితే అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించాలి.’’ అని సవాల్ విసిరింది.
Lady Aghori First Wife Radha Warning To Sri Varshini Photograph: (Lady Aghori First Wife Radha Warning To Sri Varshini)
Apr 14, 2025 18:18 IST
నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాజీవ్ యువ వికాసం గడువు పెంపు
రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ గడువును పెంచింది. ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
CM Revanth Key Decision on Gig Workers
Apr 14, 2025 16:49 IST
చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్
కర్ణాటకలోని హుబ్బాలీలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 5ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ కామాంధుడు రేప్ చేశాడు. ఆపై గొంతునులిమి హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్ చేశారు.
Apr 14, 2025 09:06 IST
Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ మరో భారీ దాడి.. 34 మంది మృతి
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. ఇందులో 34 మంది చనిపోగా.. 117 మందికి గాయాలయ్యాయి.
Sumy City, Ukraine
Apr 14, 2025 09:03 IST
భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!
సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వసతి గదుల కోసం.. దర్శన ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ తెచ్చుకోవాలి.సిబ్బంది స్కానింగ్ చేసిన నేరుగా గదులు కేటాయిస్తారు.ఈ విధానం వల్ల క్యూలైన్లలో నిల్చునే ఇబ్బంది తప్పుతుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు.
Apr 14, 2025 06:52 IST
DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్
ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది.
DC VS MI
Apr 14, 2025 06:52 IST
Holiday: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఈ వారంలోనే రెండు సెలవులు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త ఒకటి ప్రభుత్వాలు ప్రకటించాయి. సోమవారం మాత్రమే కాకుండా..ఈ వారంలోనే గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మరో సెలవు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Telangana and Andhra Pradesh School Holiday Photograph: (Telangana and Andhra Pradesh School Holiday)