Biryani : రంజాన్‌ మాసంలో బిర్యానీని తెగ లాగించిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లో తెలుసా?

రంజాన్‌ మాసం సందర్భంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్‌ టాప్‌ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. కేవలం నెల రోజుల్లో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇటు బిర్యానీతో పాటు రంజాన్‌ స్పెషల్‌ అయిన హాలీమ్‌ కూడా నగరవాసులు తెగ తిన్నట్లు తెలుస్తుంది.

New Update
Biryani : రంజాన్‌ మాసంలో బిర్యానీని తెగ లాగించిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లో తెలుసా?

Hyderabad Biryani : బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడతారు. అందులోకి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇక చెప్పడానికి మాటలు ఉండవు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ బిర్యానీది ప్రత్యేకమైన స్థానం అంతే. ఇతర రాష్ట్రాల నుంచి కూడా నగరానికి వచ్చి మరీ బిర్యానీ తిని వెళ్తుంటారు.

ఇక రంజాన్‌(Ramadan) మాసం వచ్చిందంటే.. ఇక బిర్యానీలు, హాలీం(Haleem) లు ఏ విధంగా సేల్‌ అవుతాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో మొత్తంగా హైదరాబాద్‌ బిర్యానీ(Hyderabad Biryani) టాప్ లో ఉంటుంది. ఈ నెల మొత్తం మీద ఏకంగా 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ని ఆర్డర్‌ చేసినట్లు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది.

ఈ సంవత్సరం రంజాన్‌ మాసం మార్చి 11 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఏప్రిల్‌ 8 వరకు దేశ వ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ ఆర్డర్ల గురించి స్విగ్గీ(Swiggy) తాజాగా వెల్లడించింది. ఈ నెల మొత్తంలో దేశ వ్యాప్తంగా సుమారు 60 లక్షల బిర్యానీ పార్సిల్స్‌ ని అందించినట్లు స్విగ్గీ తెలిపింది. ఇవి సాధారణ రోజుల కంటే 15 శాతం ఎక్కువ.

బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్‌ టాప్‌ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. కేవలం నెల రోజుల్లో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ అంటే మామూలు విషయం కాదు. ఇటు బిర్యానీతో పాటు రంజాన్‌ స్పెషల్‌ అయిన హాలీమ్‌ కూడా నగరవాసులు తెగ తిన్నట్లు తెలుస్తుంది. బిర్యానీ ఆర్డర్లు పది లక్షలు వస్తే.. హాలీమ్‌ ఆర్డర్లు సుమారు 5. 3 లక్షలు వచ్చాయి.

Also read: ఈ వేసవిలో పెసరపప్పు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు