Nitish Kumar: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పురోగతి లేదు.. నితీష్ కుమర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ వల్లే ఇండియా కూటమిలో పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే దృష్టి పెట్టిందని.. అందుకే ఇండియా కూటమిలో దూకుడు తగ్గిపోయినట్లు తెలిపారు.

New Update
Nitish Kumar: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పురోగతి లేదు.. నితీష్ కుమర్ సంచలన వ్యాఖ్యలు

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదన్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపైనే ఆ పార్టీ దృష్టి పెట్టిందని పేర్కొ్న్నారు. అందుకే ఇండియా కూటమిలో దూకుడు తగ్గిపోయిందని చెప్పారు. బీజేపీ హటావో.. దేశ్ బచావో పేరుతో పాట్నాలోని కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించేందుకు అందరం ఒప్పుకున్నామని.. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాకే ఇండియా కూటమి మరో సమావేశం జరిగేలా కనిపిస్తోందని తెలిపారు.

Also read: వామ్మో.. ఆ దేశంలో ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్షలు

కాంగ్రెస్ పార్టీ వల్లె ఇండియా కూటమి దెబ్బతింటోందని.. అందుకే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యే అంశం ఆలస్యంగా జరుగుతోందని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే పాట్నాలో మొదటి సమావేశం జరిగింది. ఇక రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. ఇక మూడో సమావేశం ముంబయిలో ఆగష్టు 31న నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ సీట్ల షేరింగ్‌ విషయంలో మాత్రం పార్టీల మధ్య విబేధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Also Read: ఐబ్రోస్‌ షేప్‌ నచ్చలేదని ..ఫోన్లోనే ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త!

మరోవైపు నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపైనే ఫోకస్ పెట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు