కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి!!

మనం రోజువారి పనులు సక్రమంగా చేసుకోవాలన్నా, నడవటానికి, పరిగెత్తడానికి, దూకడానికి ఇలా ఏమి చేయాలన్నా శరీరంలోని కీళ్లు ముఖ్యంగా పని చేస్తాయి. మరి ఆ కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఎంతో మంది కీళ్ల నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఏచిన్న పని చేయాలన్నా కష్టంగా మారుతుంది. మనం శారీరకంగా...

New Update
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి!!

మనం రోజువారి పనులు సక్రమంగా చేసుకోవాలన్నా, నడవటానికి, పరిగెత్తడానికి, దూకడానికి ఇలా ఏమి చేయాలన్నా శరీరంలోని కీళ్లు ముఖ్యంగా పని చేస్తాయి. మరి ఆ కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో ఎంతో మంది కీళ్ల నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఏచిన్న పని చేయాలన్నా కష్టంగా మారుతుంది. మనం శారీరకంగా యాక్టీవ్ గా ఉండటానికి కీళ్లు ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అలాంటి కీళ్లు మరింత ఆరోగ్యంగా ఉండాలంటే మన డైట్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిందే. మీ ఆహారంలో పోషకాలు మెండుగా ఉండే ఆహారం ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండాలి. మరి ఆరోగ్యకరమైన కీళ్ల కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి చూసేద్దామా.

పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులు, ఫిట్ నెస్ ను తగ్గించడానికి సహాయపడతాయి. కీళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మీ ఆహారంలో పసుపును యాడ్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.

ఆకుకూరలు: ఆకు కూరల్లో విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడి.. కీళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

నట్స్: వాల్ నట్ లు, అవిసె గింజలు, చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిట్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటలను తగ్గించి, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఆలీవ్ ఆయిల్: ఆలీవ్ ఆయిల్ లో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తాయి.

గ్రీన్ టీ: గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మెళనాలు మంటను తగ్గించడానికి, మృదులాస్థి నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి.

సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో కొల్లాజెన్ సంశ్లేషణకు అవసరమైన విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఇది కీళ్లకు బలంగా పని చేస్తుంది.

తృణధాన్యాలు: బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ వంటి తృణధాన్యాలు ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తాయి. ఈ పోషకాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. మిమ్మల్ని ఆరోగ్యం ఉంచుతాయి.

బెర్రీలు: బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, శరీరంలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి మీ డైట్ లో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి వాటిని చేర్చుకుంటే మంచిది. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అల్లం: అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్లలో మంట, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. పసుపులో జింజెరోల్స్ ఉంటుంది. ఇది ఆర్థరైటీస్ లక్షణాలను తగ్గిస్తుంది.

ఫ్యాటీ ఫిస్: సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. తద్వారా శరీరంలో మంట, వాపును తగ్గిస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కీళ్ల నొప్పులతో బాధపడేవారు వారి డైట్‌ లో ఫ్యాటీ ఫిష్‌ కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు