Mid Cap Shares : ఈ మిడ్ క్యాప్ షేర్లు లాభాల పంట పండిస్తాయంటున్నారు.. అవేమిటంటే.. రాబోయే రోజుల్లో కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాలను అందించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్ జీ ఇన్ ఫ్రా ఇంజినీరింగ్, పీవీఆర్ ఐనాక్స్, పీఎన్ సీ ఇన్ ఫ్రా టెక్, ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్, సన్ టెక్ రియల్టీ షేర్లు లాభపడొచ్చని స్టాక్ అనలిస్టుల అంచనా. By KVD Varma 11 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Mid Cap Shares Profit : స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే.. రిస్క్ తో సహజీవనం చేయడం వంటిదే. అయితే, జాగ్రత్తగా పెట్టుబడి పెడితే అసలుకు ముప్పు రాకుండా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇక రిస్క్ కి సిద్ధపడి స్టాక్ మార్కెట్లో(Stock Market) ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, మార్కెట్ తీరు తెన్నులను పరిశీలించడం చాలా అవసరం. అలానే, నిపుణులు చెబుతున్న సలహాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు రాబోయే రోజుల్లో భారీగా లాభాలను నమోదు చేస్తాయని స్టాక్ మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్న ఐదు మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. గత కొంత కాలంగా ఈ స్టాక్స్(Mid Cap Shares) పెర్ఫామెన్స్ ను పరిశీలించిన స్టాక్ మార్కెట్ అనలిస్టులు వీటికి వచ్చే 12 నెలలకు టార్గెట్ ధరలను నిర్ణయించారు. దాదాపుగా పది మంది స్టాక్ అనలిస్టులు వీటిని కొనవచ్చనే రేటింగ్ ఇచ్చారు. ఆ ఐదు మిడ్ క్యాప్ స్టాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హెచ్ జీ ఇన్ ఫ్రా ఇంజినీరింగ్ (HG Infra Engineering) Mid Cap Shares : ఈ స్టాక్ కొనవచ్చనే రేటింగ్ ఇచ్చారు ఎనలిస్టులు. ఈ స్టాక్ వచ్చే కొద్దీ రోజుల్లో 28.8 శాతం వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,612 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 863.80 వద్ద ఉంది. పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) ఈ స్టాక్ మీద కూడా మంచి అంచనాలే వున్నాయి మార్కెట్ నిపుణుల దగ్గర. రాబోయే రోజుల్లో ఇది 28.8 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. దీనికి బై రేటింగ్ ఇచ్చారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15,535 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 1,563.95 గా ఉంది. పీఎన్ సీ ఇన్ ఫ్రా టెక్ (PNC Infra Tech) స్టాక్ మార్కెట్ అనలిస్టులు ఈ స్టాక్ కూడా తప్పకుండ కొనవచ్చనే రేటింగ్ ఇచ్చారు. ఈ స్టాక్ 25.9 శాతం వరకు పెరిగే అవకాశముందని వారి అంచనా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,847 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 348.50 గా ఉంది. Also Read : ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ఫ్యూషన్ మైక్రో ఫైనాన్స్ (Fusion Micro Finance) మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ స్టాక్ కూడా 24.4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,100 కోట్లుగా ఉంది. అనలిస్టులు స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 609.85 వద్ద ఉంది. సన్ టెక్ రియల్టీ (Sunteck Realty) ఈస్టాక్ పై కూడా విశ్లేషకులు మంచి అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 457 గా ఉన్న ఈ స్టాక్ ధర రాబోయే రోజుల్లో 20.6 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి స్ట్రాంగ్ బై రేటింగ్ ఇచ్చారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,538 కోట్లుగా ఉంది. గమనిక: ఈ ఆర్టికల్ పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ తో కూడి ఉంటాయి. ఈ ఆర్టికల్ ఏ విధమైన స్టాక్ ను కొనమని కానీ అమ్మమని కానీ సూచించడం లేదు. మార్కెట్ తీరు తెన్నులను వివరిస్తుంది అంతే. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆర్థిక నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నాము Watch this interesting Video : #stock-market #investments #mid-cap-shares మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి