Breaking : 'దేవర' షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే?

New Update
Breaking : 'దేవర' షూటింగ్ లో ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరిగిందంటే?

Accident In Devara Shooting :  జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదంపై పూర్తి వివరాలను ఆరా తీసే పనిలో పడ్డారు.

ఏం జరిగిందంటే..

'దేవర' మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్(Andhra Pradesh) లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదం వద్ద జరుగుతోంది. షూటింగ్ జరుగుతుండగా చిత్ర యూనిట్ సభ్యులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయినట్లు తెలిసింది.

ఈ ప్రమాదాన్ని గమనించిన అక్కడి స్థానికులు గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక విషయం తెలిసిన నందమూరి అభిమానులు తమ హీరోకి ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ ఉన్నాడా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read : ఉస్తాద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ వచ్చేస్తుంది, ఎప్పుడంటే?

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్

'జనతా గ్యారేజ్' వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'దేవర' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న గ్రాండ్ గా విడుదల కానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు