Hyderabad Real Estate: హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. !

దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కొండాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో గడిచిన మూడు సంవత్సరాల్లో సుమారు 33 శాతం పెరిగాయి.

New Update
Hyderabad Real Estate: రాజధానిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..అయినా వెనకాడట్లే..!!

ప్రస్తుతం దేశంలో టాప్‌ నగరాల్లో ఇళ్ల ధరలు, అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ ధరలు 13 నుంచి 33 శాతం వరకు పెరిగాయని తెలుస్తోంది. అన్ని టాప్‌ సిటీలతో పోల్చుకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోనే ఎక్కువగా పెరిగినట్లు సమాచారం.

అందులో కూడా గచ్చిబౌలి ఏరియాలో ఇళ్ల రేట్లు మరింతగా పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి గచ్చిబౌలిలో చదరపు అడుగు సగటు ధర రూ. 6,355 గా నమోదు అయ్యింది. మూడేళ్ల క్రితం ఇదే నెలలో రూ. 4,790 గా ఉంది. ఇలా ఉంటే కొండాపూర్‌ లో చదరపు అడుగు రూ. 6,090 గా ఉంది.

కేవలం హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌ ఏరియాలో ఇళ్ల రేట్లు గడిచిన మూడు సంవత్సరాలలో భారీగా పెరిగాయి. డిమాండ్‌ కు తగినట్లుగానే అడుగు ధర రూ.6,325 కి పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రాపర్టీల రేట్లు పెరుగుతునే ఉన్నాయి. నిర్మాణ ఖర్చులు పెరగడంతో పాటు ముడి సరుకుల ధరలు కూడా ఎక్కువవ్వడం, ల్యాండ్ ధరలు పెరగడంతో పాటు డిమాండ్ కొనసాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఇళ్లు కొనాలనేకునే వారు పెద్ద ఇళ్లకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని తెలుస్తుంది. అన్ని సౌకర్యాలు ఉండే ఇళ్లనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అందుకే రేట్లు పెరుగుతున్నాయని తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌, ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ లో ఇళ్ల ధరలు గత మూడేళ్లలో 27 శాతం వరకు పెరిగాయి.

మరోపక్క రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ దూసుకుపోతుంది. ఈ ఏడాది నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 62 శాతం పెరిగింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును తాత్కాలికంగా ఆపడం, డిమాండ్‌ కొనసాగుతుండడం వంటి కారణాలతో రియల్టీ షేర్లు విపరీతంగా పెరిగాయి. దీంతో కంపెనీలు కూడా పెద్ద మొత్తంలో బుకింగ్స్‌ అందుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందుబాటులోకి వస్తుండడంతో సేల్స్ పెరుగుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. మరిన్ని కొత్త లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉండడంతో రియల్టీ కంపెనీల షేర్లు ఇంకా పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Also read: వైజాగ్‌లో బెస్ట్‌ లవర్స్‌ స్పాట్స్‌ ఇవే 🥰.. ప్రేమ లోతులు బయటపడే ప్రదేశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు