Betting Apps: దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న బెట్టింగ్ యాప్‌లు మహదేవ్‌లాంటి బెట్టింప్ యాప్‌లు దేశ భద్రతకు ముప్పుగా మారాయి. అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు చేరుతున్నాయి. ఇది టెర్రర్ ఫైనాన్సింగ్ కిందకే వస్తాయని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. By B Aravind 13 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే అవి కాస్త బెట్టింగ్ యాప్‌లో పెట్టాడు... చివరకు లక్షా 20 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు.. తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మనస్తాపం చెంది చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. నల్లగొండ-రవీంద్రనగర్‌కు చెందిన కోడూరు నితిన్‌కి చెందిన కథ ఇది. ఇలాంటి నితిన్‌లు ఇండియాలో మనకు చాలా చోట్ల కనిపిస్తారు. ఇలాంటి విషాధ గాధలు ప్రతీరోజూ వినిపిస్తుంటాయి. బెట్టింగ్ యాప్స్‌కు బలయ్యే వారు తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు అటు దేశానికి, దేశభద్రతకూ ముప్పును తీసుకువస్తున్నారు. అవును.. ఇది నిజమే..! మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు బెట్టింగ్ యాప్స్ అడ్డాలని పలు రీసెర్చుల్లో తేలింది! అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా పనిచేస్తున్నాయట. ఇదే విషయాన్ని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయానికి చెందిన సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ రీసెర్చ్ అసోసియేషన్ చెప్పింది. చట్టవిరుద్ధ ఆన్‌లైన్ జూదంతో పాటు బెట్టింగ్ అప్లికేషన్‌లు సైబర్ సెక్యూరిటీ దాడుల లాంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్‌లు మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా పని చేస్తున్నాయి. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారాయి. Also read: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ భారత్‌లో బెట్టింగ్, జూదం మార్కెట్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంపై అధికారిక అంచనా లేదు. 2017 నాటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో అక్రమ బెట్టింగ్ జూదం మార్కెట్ విలువ విపరీతంగా పెరిగింది. ఇది దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీలు వారికి వచ్చే డబ్బులను విదేశాలకు పంపుతున్నాయని రీసేర్చ్‌లు చెబుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిషేధించడానికి పూర్తిస్థాయి కంట్రోల్ ఉండాలి. దీనికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించినా ఇంకా అవి అమలు కావడంలేదన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ మనీలాండరింగ్‌కు ఎలా పాల్పడుతున్నాయో తెలుసుకునేందుకు బెస్ట్ ఎగ్జాంపూల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్. మహాదేవ్ యాప్ వార్షిక టర్నోవర్ సుమారు రూ. 5,000 కోట్లు. ఈ యాప్‌లకు చాలా మంది సెలబ్రిటీలు, కొంతమంది క్రికెటర్లు కూడా ప్రమోట్ చేశారు. 2023 ఫిబ్రవరిలో మహాదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహం దుబాయ్‌లో జరిగింది. ఈ వివాహానికి దాదాపు 17 మంది బాలీవుడ్ ప్రముఖులను చార్టర్డ్ విమానం ద్వారా ఆహ్వానించారు. పెళ్లిలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా చేశారు. ఈ పెళ్ళి కారణంగానే హవాలా ద్వారా కోట్లాది రూపాయలు ముడుపులు ఇతర దేశాలకు చేరుతున్నాయని అధికారులకు అర్థమైంది. Also Read: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం ఇలా కేవలం మహాదేవ్ బెట్టింగ్ యాప్ మాత్రమే కాదు..ఇలాంటి యాప్‌లు చాలానే ఉన్నాయి. అవి దేశ భద్రతకు ముప్పుగా మారాయి. అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు చేరుతున్నాయి. ఇది టెర్రర్ ఫైనాన్సింగ్ కిందకే వస్తాయని అధికారులు తేల్చి చెబుతున్నారు. అటు ప్రజలు ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈజీ మనీ ఎర్నింగ్ కోసం యువత ఎక్కువగా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వైపు మొగ్గుచూపుతోంది. అందుకే యువతే ఈ ట్రాప్‌లో చిక్కుకుంటోంది. #telugu-news #national-news #betting-apps మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి