Breaking : చిక్కుల్లో లోకేశ్...రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు తనయుడి పేరు..!! ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ రిపోర్టును సీఐడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రధాన నిందితుడిగా సీఐడీ పేర్కొంది. చంద్రబాబుతోపాటు లోకేశ్ పేరును కూడా పేర్కొంది By Bhoomi 10 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీపీ కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించారు. అసలు స్కిల్ స్కామ్ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ క్లియర్ గా వివరించింది. చంద్రబాబే కుట్రకు సూత్రధారి అంటూ సీఐడీ పేర్కొంది. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు తనయుడు లోకేష్ పేరునుకూడా ప్రస్తావించారు. కిలారి రాజేశ్ ద్వారా లోకేశ్ కు డబ్బులు ముట్టాయని సీఐడీ తెలిపింది. సీఐడీ డీఎస్సీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి కేసులో ఏసీపీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఇప్పటికే సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ప్రధాన నిందితుడి ఏ1గా చేర్చింది సీఐడీ. ఈ క్రమంలో ఆయన్ను విచారించేందుకు 15రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలని న్యాయమూర్తినిని సీఐడీ కోరింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద విజయవాడ కోర్టులో ఈ రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబు పై నేరాభియోగం మోపినట్లు తెలుస్తోంది. ఉద్దేశవూర్వకంగా మోసం చేయడం, ఫోర్జరీ చేసి మోసం చేయడం, డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం, వంటి అభియోగాలు ఉన్నట్లు సీఐడీ ఆరోపిస్తోంది. #nara-lokesh #arrest #chandrababu #ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి