IPL 2024: టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సత్తా ఆ టీమిండియా స్టార్ ఆటగాడిదే..

టీ20 క్రికెట్‌లో ఇప్పుడు సెంచరీలు కామన్‌గా మారాయి. అయితే ఐపీఎల్‌లో ఫస్ట్‌ 200 ఎవరు కొడతారు? ఈ ఆసక్తికర ప్రశ్నకు న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ విలియమ్సన్‌ చెప్పిన సమాధానం తెలుసుకోండి.

New Update
IPL 2024: టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సత్తా ఆ టీమిండియా స్టార్ ఆటగాడిదే..

Kane Williamson Said Rohit Sharma could Score 200 in T20: ధనాధన్‌ టీ20 ఫార్మాట్‌ చాలా మందిని క్రికెట్‌కి ఫ్యాన్స్‌గా మార్చింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వంటి మెగా టోర్నీలు టీ20 క్రికెట్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ప్రపంచంలోని రిచెస్ట్‌ స్పోర్ట్స్‌ లీగ్‌లో ఒకటిగా ఐపీఎల్‌ ఎదిగింది. ఈ పొట్టి క్రికెట్‌ ఫార్మాట్‌లో బ్యాటర్లదే హవాగా చెప్పవచ్చు. పెద్ద బ్యాట్‌లకు చిక్కకుండా, బౌండరీలు దాటకుండా బంతులు వేయడం బౌలర్లకు కష్టంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో నమోదవుతున్న భారీ స్కోర్లు పరిశీలిస్తే బ్యాట్స్‌మెన్ డామినేషన్‌ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.మరి భారీ స్కోర్లు, వరుస సెంచరీలు నమోదవుతున్న ఐపీఎల్‌ 2024లో వ్యక్తిగత అత్యధిక పరుగుల రికార్డు కూడా బద్దలవుతుందా? టీ20 క్రికెట్‌లో ఇప్పుడు సెంచరీలు కామన్‌గా మారాయి. అయితే ఐపీఎల్‌లో ఫస్ట్‌ 200 ఎవరు కొడతారు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ విలియమ్సన్‌ చెప్పిన సమాధానం తెలుసుకోండి.

ఐపీఎల్ 2024 టోర్నమెంట్‌లో తొలుత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏకంగా 277 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇంతటి భారీ టార్గెట్‌ను ముంబై ఇండియన్స్‌ ఛేదించేలా కనిపించింది. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లలో రన్‌ రేటు తగ్గిపోవడం, వరుసగా వికెట్లు పడిపోవడంతో 246 పరుగులకు పరిమితం అయింది. అయితే ఈ మ్యాచ్‌లో అంతకు ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు 267ను సన్‌రైజర్స్‌ అధిగమించింది.ఆ తర్వాత కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR) మరో భారీ స్కోర్‌ను సాధించింది. దాదాపుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అత్యధిక స్కోరు బద్ధలయ్యేలా కనిపించింది. చివరికి కేకేఆర్‌ 272 పరుగులు సాధించి, 5 పరుగుల తేడాతో రికార్డు కోల్పోయింది. చాలా మంది ఈ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమని భావించారు.

Also Read: దేశంలో ప్రసిద్ధి చెందిన రామాలయాలు.. జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలి..!

అయితే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 287 పరుగులతో సన్‌రైజర్స్‌ తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. ఆర్సీబీ కూడా సన్‌రైజర్స్‌కి గట్టి పోటీ ఇచ్చింది. బెంగళూరు కూడా ఏకంగా ఛేజింగ్‌లో 267 పరుగులు చేసింది. పరిస్థితులు అనుకూలించి ఉంటే బెంగళూరు మళ్లీ ఐపీఎల్‌లో అత్యధిక పరుగ రికార్డును తన పేరిట రాసుకునేది.ఇటీవల కోల్‌కతా వర్సెస్‌ రాజస్థాన్‌ మ్యాచ్‌లో మరో రికార్డు క్రియేట్‌ అయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 223 పరుగుల చేసింది. భారీ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన రాజస్థాన్‌ 8 వికెట్లు కోల్పోయి 224 పరుగుల చేసి విజయం సాధించింది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని అందుకుని రికార్డు క్రియేట్‌ చేసింది.

ఒకప్పుడు ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు నమోదు కావడం చాలా అరుదు. అంతటి భారీ స్కోరు సాధిస్తే విజయం తథ్యమనే భావన ఉండేది. ప్రస్తుతం 200 స్కోరు అనేది సాధారణమైపోయింది. ప్లేయర్లు అత్యధిక స్ట్రైక్‌ రేటుతో పరుగులు సాధిస్తున్నారు. IPL 2024లో RRతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్‌ కోహ్లి 67 బంతుల్లో సెంచరీ చేశాడు.స్ట్రైక్‌ రేటు తక్కువగా ఉందని చాలా విమర్శలు వచ్చాయి. రాజస్థాన్‌ ప్లేయర్‌ బట్లర్‌ ఏకంగా రెండు సెంచరీలు బాదాడు. అలానే కేకేఆర్‌ నరైన్‌, సన్‌రైజర్స్‌ హెడ్‌ కూడా వంద కొట్టాడు. ప్రస్తుతం 200కి పైగా స్ట్రైక్‌ రేటుతో బ్యాటింగ్‌ చేస్తేనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టీ20 క్రికెట్‌లో మొదటి డబుల్ సెంచరీని చూసే సమయం దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.

టీ20లో 200 ఎవరు కొడతారు?
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జియో సినిమాలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ (Rohit Sharma) T20లో డబుల్ సెంచరీ స్కోర్ చేస్తాడని జోస్యం చెప్పాడు. వన్డే క్రికెట్‌లో మూడు సార్లు 200కి పైగా స్కోర్‌ చేసిన రోహిత్‌ ఐపీఎల్‌ కూడా రికార్డు క్రియేట్‌ చేస్తాడని విలియమ్సన్‌ చెప్పాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక స్కోరు రికార్డు క్రిస్ గేల్ (175) పేరిట ఉంది. టీ20లో నంబర్‌ 1 ర్యాంకులో ఉన్న సూర్యకుమార్‌ను, ఈ సీజన్‌లో 2 సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను విలిమ్సన్‌ సెలక్ట్‌ చేయలేదు.

ఇటీవలే చెన్నై మ్యాచ్‌లో రోహిత్ 105 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024లో ఓవరాల్‌గా రోహిత్ శర్మ 167 స్ట్రైక్ రేట్‌తో 261 పరుగులు చేశాడు. తనదైన రోజు హిట్‌మ్యాన్‌ టీ20లో 200 బాదడం అసాధ్యమేమీ కాదని ఫ్యాన్స్‌, క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు