Thailand: ఆసియాలోకి ఎంటర్ అయిన మంకీ పాక్స్.. కాంగోలో బీభత్సం సృష్టిస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాలా వేగంగా ఇతర దేశాలకూ పాకుతోంది. తాజాగా ఇప్పుడు ఈ వైరస్ ఆసియాలో కూడా ప్రవేశించింది. తమ దేశంలో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదయిందని థాయ్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. By Manogna alamuru 23 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Monkeypox: ఆఫ్రికా దేశం కాంగోలో మొదలైన మంకీపాక్స్ నెమ్మదిగా తీవ్ర రూపం దాల్చుతోంది. ఆఫ్రికాలో 12 దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ఐరోపా దేశాలకు ఇప్పుడు ఆసియాలోనూ ప్రవేశించింది. తమ దేశంలో మొదటి కేసు నమోదయిందని థాయ్ లాండ్ ప్రభుత్వం ధృవీకరించింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి ఆఫ్రికా నుంచే వచ్చారని తెలిపింది. ఆగస్టు 14న వచ్చిన అతనికి ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతన్ని పరీక్షించి Mpox, క్లాడ్ 1B అనే స్ట్రెయిన్ నిర్ధారించారు. ఆఫ్రికా బయట ఇప్పటికి మూడు దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆఫ్రికా వెలుపల స్వీడన్ లో మంకీ పాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇక మన పొరుగుదేశం పాకిస్థాన్ లో మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ వ్యాప్తి చెందిన తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాపించిందని WHO తెలిపింది. వ్యాధి గ్రస్తులతో దగ్గర సంబంధాల ద్వారా వ్యాపించే Mpox, సాధారణంగా తేలికపాటిది కానీ అరుదైన సందర్భాల్లో మరణానికి దారితీయవచ్చు. వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి చర్మంపై ఫ్లూ వంటి లక్షణాలు, చీముతో నిండిన గాయాలు కనిపిస్తాయి. కాంగోలో వ్యాప్తి ప్రారంభంలో స్థానిక క్లాడ్ I జాతికి సంబంధించినది. ఇప్పుడు ఎంపాక్స్ వైరస్‌కు ఒక కొత్త రూపాంతరం, క్లాడ్ Ib వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాలకు వ్యాపించింది. దీంతో WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. "తూర్పు DRCలో కొత్త క్లాడ్ పాక్స్‌ను గుర్తించడం అది వేగంగా వ్యాప్తి చెందడం జరుగుతోంది. ఇంతకుముందు mpoxని రిపోర్ట్ చేయని పొరుగు దేశాలకు కూడా ఇది వ్యాప్తి చెందడం అలాగే, ఆఫ్రికాలో, వెలుపల మరింత వ్యాప్తి చెందే అవకాశం చాలా ఆందోళన కలిగిస్తుంది" అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. Also Read: Supreme Court: కోల్‌కతా డాక్టర్ కేసులో ప్రిన్సిపల్ పాత్రపై సుప్రీంకోర్టు అనుమానాలు #virus #thailand #monkeypox #asia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి