థాయ్‌లాండ్‌లో 49 మందితో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ThailandBus Crash Kills : థాయ్‌లాండ్ (Thailand)లో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రిపూట 49 మంది ప్రయణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పడంతో చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రచౌప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ లో ఈ ప్రమాదం (Accident)జరిగింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థాలానికి చేరుకున్నారు. ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
TG Crime: కూతురు కాళ్లు పట్టుకుంటే తల్లి పీక పిసికింది.. భార్య చేతిలో బలైన మరో భర్త!
మెదక్‌లో మరో దారుణం జరిగింది. నామాపూర్‌లో మద్యానికిబానిసై వేధిస్తున్న జోగయ్యను భార్య నాగమ్మ తన కూతురి సాయంతో చంపేసింది. కూతురు కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు చీర చుట్టి కడతేర్చింది. నాగమ్మపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG Crime: మెదక్‌లో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హతమార్చింది. కూతురితో కలిసి కనికరంలేకుండా చంపేసి కాటికి పంపించారు. వొద్దని తండ్రి వేడుకుంటున్నా ఏ మాత్రం జాలిచూపకుండా అదిమిపట్టి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్థులు రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడగా అమానుషమైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మెడకు చీర బిగించి హతం..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్ లో ఆదివారం ఈ ఘటన జరిగింది. గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా మద్యానికి బానిసైన జోగయ్య.. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అలాగే తాగిన జోగయ్య.. గట్టిగా మందలిస్తే భార్య, బిడ్డను కొట్టేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాగమ్మ తన ఇంట్లో చిన్న కూతురి సహాయంతో జోగయ్యను చంపేసింది. మద్యం మత్తులో ఉన్న జోగయ్య కూతురు అతని కాళ్లు పట్టుకోగా నాగమ్మ మెడకు చీర బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది.
అనుమానంతో పక్కింటివారు జోగయ్య ఇంటికి వెళ్లగా అతను అపస్మారక స్థితిలో పడివున్నాడు. వెంటనే మెదక్ ఆస్ప త్రికి తరలించారు. కానీ అప్పటికే జోగయ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జోగయ్య మెడకు కమిలిన గాయం గమనించి నాగమ్మను నిలదీయడంతో నిజం ఒప్పుకుంది. జోగయ్య సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.