Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. ఓఎంఆర్‌ పద్ధతిలో ప్రిలిమ్స్

తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఓంఎంఆర్‌ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

New Update
Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. ఓఎంఆర్‌ పద్ధతిలో ప్రిలిమ్స్

తెలంగాణలో 563 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీ కోసం ప్రలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు TGPSC ( ఇంతకుముందు TSPSC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9న ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. 2022లో విడుదలైన గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కమిషన్.. 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరీలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు తదితర వాటిపై కమిషన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది.

Also Read: రేవంత్ సర్కార్ కు ఈసీ గుడ్ న్యూస్

మరోవైపు ప్రిలిమ్స్‌ను ఓంఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అభ్యర్థలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఈ పరీక్షను ఓఎంఆర్‌ లేదా సీబీఆర్‌టీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) పద్ధతితో నిర్వహించే ఛాన్స్ ఉందని.. దీనిపై చివరి నిర్ణయం కమిషన్ తీసుకుంటుందని పేర్కొంది. భారీగా దరఖాస్తులు రావడం వల్ల సీబీఆర్‌టీ విధానంలో సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే ఒక్కరోజులోనే పరీక్ష పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక హాల్‌టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

Also read: రేవ్ పార్టీలో పోలీసుల హస్తం.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. వెలుగులోకి సంచలన విషయాలు!

అలాగే గ్రూప్‌-1 నియామకాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని టీజీపీఎస్సీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇక అక్టోబర్ 21 మెయిన్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పింది. దీంతో ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ప్రిపరేషన్ కోసం సమయం దొరుకుతుంది. ప్రధాన పరీక్షలు మొత్తం 7 పేపర్లలో జరుగుతాయి. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన వారిని జోన్లవారిగా పోస్టుల సంఖ్యకు అనుగూణంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిజర్వుడ్ వర్గాలవారీగా 1:50 నిష్పత్తిలో తీసుకుంటారు. అయితే రిజర్వుడ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైనట్లైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు