Weather Alert : వాతావరణంలో మర్పులు.. దేశంలో మార్చిలోనే వడగాలులు..

దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే ఛాన్స్ ఉంది. దీన్ని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.

New Update
Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Weather Alert : ఎండకాలం(Summer) పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. గతంలో బీహార్, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలో మార్చి నెలలోనే 40 డిగ్రీలు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్(Climate Central) అనే శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.

Also Read : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్‌ కూడా ఆ లిస్ట్‌ లో !

గ్లోబల్ వార్మింగ్ వల్లే

ఈ శాస్త్రవేత్తల బృందం 1970 నుంచి ఇప్పటిదాక ఇండియాలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉష్ణోగ్రతలను విశ్లేషించింది. నార్త్‌ ఇండియాతో సహా.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయని తెలిపింది. దేశంలో 51 నగరాల్లో మార్చి చివరి వారంలో ఉష్ణోగ్రతలు 40లకు చేరు అవకాశాలున్నాయని వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్‌(Global Warming) వల్లే మార్చిలో వడగాలులు వస్తున్నాయని తెలిపారు. ఈసారి మార్చి చివరి వారంలో వడగాలలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకే వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పరిష్కారం ఏంటంటే

ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వడగాలులు(Hailstorms) రావడానికి కారణం వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడమే. ఇప్పటికే కర్బన ఉద్గారాలతో వాతావరణం వేడిక్కిపోతోంది. దేశంలో కూడా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నగరాలు, పట్టణాలు పెరగడం, వేగవంతమైన పారిశ్రామికీకరణ, కాలుష్య ఉద్గారాలు ఎక్కువగా పెరిగిపోవడమే దీనికి కారణం. అయితే దీనికి పరిష్కారం వాతవరణాన్ని చల్లబరచడమే. ఇందుకోసం అన్నిచోట్ల పచ్చదనం పెరగాలి. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలు తగ్గించాలి.

Also Read : సీఎం కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు